English   

థియేటర్స్ కంటే ఓటిటి నయం అంటున్న నిర్మాతలు.. 

OTT
2020-12-02 12:21:02

డిసెంబర్ లో థియేటర్స్, మల్టీప్లెక్స్ లు తెరవడానికి సిద్ధమవుతున్నారు ఎగ్జిబిటర్లు. ఈ క్రమంలోనే అందరికంటే ముందు డిసెంబర్ 4న మహేష్ బాబు తన ఏఎంబి మాల్ ఓపెన్ చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే మరికొన్ని థియేటర్స్ కూడా తెరవడానికి ఎగ్జిబిటర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నియమాలను వాళ్లు పాటించాల్సి వస్తుంది. 7 నెలలుగా మూతపడి ఉన్న సినిమా థియేటర్లకు మునుపటి కళ వస్తుంది అంటూ ఎగ్జిబిటర్లు పండగ చేసుకుంటున్నారు. అయితే వాళ్లు అనుకున్న మంచి రోజులు ఇప్పట్లో రావు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పటికే సినిమా పరిశ్రమ దాదాపు 10 వేల కోట్లు నష్టపోయింది. గత ఆరు నెలలుగా సినిమా థియేటర్లు మూతపడి దారుణంగా నష్టపోయారు. మరికొందరు జీవనాధారం లేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా థియేటర్లు ఓపెన్ చేయాలనుకోవడం నిజంగా శుభసూచకం. కానీ ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. థియేటర్స్ ఓపెన్ చేసుకోమని చెప్పి కేవలం 50 శాతం టికెట్స్ మాత్రమే అమ్ముకోవాలి అని లిటికేషన్ పెట్టింది కేంద్రం. దీనికి ఏ నిర్మాత కూడా ఒప్పుకోవడం లేదు. అసలే అత్యంత దారుణమైన నష్టాల్లో ఉన్న తమకు ఇలా 50 శాతం టికెట్లు అమ్మమని చెప్పడం ఇంకా దారుణం అంటున్నారు వాళ్ళు.

దీనికంటే థియేటర్స్ మూసుకొని ఉండటమే నయ్యం అంటున్నారు. ఇప్పటికే తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్న నిర్మాతలు థియేటర్స్ మీద ఆశలు వదిలేసుకుని ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. అక్కడ మంచి బేరం కుదిరితే తీసిన సినిమా వాళ్ళ చేతుల్లో పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఎలాగూ థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా సగం సగం డబ్బులతో బయటపడలేరు. అందుకే తమ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ విడుదల చేయాలని చాలామంది నిర్మాతలు నిర్ణయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో కొన్ని సినిమాలు ఇప్పటికే క్యూ కట్టాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటిటిలో విడుదలయ్యాయి. అందులో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కలర్ ఫోటో, ఆకాశం నీ హద్దురా లాంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అందుకే మరిన్ని సినిమాలను కూడా ఆన్ లైన్ లోనే విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. థియటేర్స్ ఓపెన్ చేసినా కూడా అటు వైపు మాత్రం ఆలోచించడం లేదు. డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ విడుదల కానుంది. ఇది వచ్చిన తర్వాత దీనికి వచ్చే రెస్పాన్స్ చూసి మిగిలిన దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటి వరకు అయితే ఓటిటి నయం అంటున్నారు వాళ్లు. 

More Related Stories