English   

పవన్ కల్యాణ్ హరీశ్ సినిమా రూమర్లపై స్పందించిన నిర్మాతలు 

Harish Shankar
2021-06-09 10:26:23

పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ వీళ్లిద్దరూ జత కలుస్తుండడంతో ఈసారి ఇంకెంత పెద్ద హిట్ వస్తుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పైగా, టైటిల్ విషయంలోనూ కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రచారం బాగా ముదరడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది.

ఒక ప్రకటన విడుదల చేసింది. ''పవన్‌కల్యాణ్ 28వ చిత్రానికి సంబంధించిన ఈ ఏడాది ఉగాది రోజున ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ విడుదల చేయాలని భావించాం. అయితే, కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశాం. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా అనేక వార్తలు, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా అధికారిక ఖాతాల ద్వారా సరైన సమయంలో వెల్లడిస్తాం'' -ట్విటర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. మరోవైపు పవన్‌కల్యాణ్‌ వరుస సినిమాలతో జోరు మీదున్నారు. ఇప్పటికే 'అప్పయనుమ్‌ కొషియుమ్‌' రీమేక్‌, 'హరి హర వీరమల్లు' చిత్రాల షూటింగ్‌ మొదలైంది. కరోనా కారణంగా వాటి చిత్రీకరణ వాయిదా పడింది. ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన వెంటనే పవన్‌ రంగంలోకి దిగనున్నారు.

More Related Stories