English   

కంగన రనౌత్ కొత్త ఇల్లు ఎలా ఉందో చూస్తారా..?

kangana
2020-05-28 07:13:00

బాలీవుడ్ లో కంగన రనౌత్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. పైగా తను సినిమాలో ఉంటే హీరోతో కూడా అవసరం లేదని చెబుతుంది ఈమె. అలాగే కొన్నేళ్లుగా వరస విజయాలు కూడా అందుకుంటుంది. విషయం ఉన్న సినిమాలతోనే విజయాలు వస్తాయని నమ్ముతుంది ఈ బ్యూటీ. మూడు సార్లు నేషనల్ అవార్డు అందుకుని ఈ తరం హీరోయిన్లలో కనీసం ఎవరూ కలలో కూడా చేరుకోలేని ఫీట్ సొంతం చేసుకుంది కంగన రనౌత్.

ప్రస్తుతం నటిగా చాలా బిజీగా ఉన్న ఈ భామ.. నిర్మాతగా కూడా బిజీ అవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలోనే తనకు కావాల్సినట్లుగా ఓ కొత్త ఇంటిని కూడా కొనేసింది. ముంబైలోని పాలి హిల్ దగ్గర ఏకంగా 48 కోట్లు పెట్టి ఈ ఇంటిని తీసుకుంది. అందులోనే తన నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ ను కూడా స్టార్ట్ చేసింది కంగన. అద్భుతమైన ఇంటీరియర్ తో పాటు ఖరీదైన వస్తువులు కూడా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

More Related Stories