English   

తీవ్ర అనారోగ్యంతో క్వారంటైన్ లో థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ 

 Prudhvi Raj
2020-08-04 15:17:04

టాలీవుడ్ కమెడియన్, మాజీ ఎస్వీబీసీ చానల్ చైర్మన్ పృథ్వీరాజ్ తీవ్ర అనారోగ్యంతో భాధపడుతూ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. గడిచిన రెండు వారాల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.  ఎన్ని మందులు వాడిన తగ్గకపోవడంతో కరోనా టెస్ట్ కూడా చేయించుకన్నారు. అందులో కూడా నెగిటివ్ వచ్చింది..అయినా  జ్వరం తీవ్రమవడంతో... హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో క్వారంటైన్ చేసి...ఆక్సిజన్ మీద చికిత్స అందిస్తున్నారు.  దానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. వెంకటేశ్వర స్వామి దయ వల్ల బాగానే ఉన్నానని..త్వరగా కోలుకుంటానని ఆయన ఆ వీడియోలో తెలిపారు. 

More Related Stories