English   

PSPK 27.. ప్రీ లుక్ పోస్టర్ అదిరింది..

Pawan Kalyan
2020-09-02 14:54:46

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఏకంగా మూడు సినిమాలు ఒకేసారి ఒప్పుకున్నాడు పవర్ స్టార్. దాంతో ఆయన పుట్టిన రోజు మొత్తం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లతో నిండిపోయింది. సెప్టెంబర్ 2ను పూర్తిగా దత్తత తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ విడుదల అయింది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా నటిస్తున్న సినిమా ప్రీ లుక్ కూడా విడుదలైంది. కోహినూర్ డైమండ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. నాగబాబు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ఇప్పుడు విడుదలైన లుక్ చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి సినిమా ఇది. చేతికి ఉంగరాలు.. నడుముకు కత్తి ఇవన్నీ చూస్తుంటే కచ్చితంగా పవన్ ఈ సారి చరిత్ర సృష్టించేలా కనిపిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. నిర్మాత ఏ.ఎం రత్నం ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరిగింది. వచ్చే ఏడాది మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు క్రిష్. సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. 

More Related Stories