Puli vachindhi Meka chachindhi Review

పులి వచ్చింది మేక చచ్చింది రివ్యూ
జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి, యోగి, వర్ష, మను, అ శేఖర్ యాదవ్, చందు, సుజిత్, శంకర్ తదితరులు నటించిన విభిన్న కథా చిత్రం పులి వచ్చింది మేక చచ్చింది. ఈ చిత్రానికి అ శేఖర్ యాదవ్ దర్శకత్వం వహించారు. భవానీ శంకర్ కొండోజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 17న విడుదలైంది. మరి.. పులి వచ్చింది మేక చచ్చింది ఎలా ఉందో చెప్పాలంటే ముందుగా కథ చెప్పాలి.
కథ - ఆస్ట్రేలియాలోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పాండా (ఆనంద్ భారతి), పోలీస్ ఆఫీసర్ గోవి( మను) ఇద్దరూ మంచి స్నేహితులు. పాండా ఇప్పటి వరకు రాని విధంగా క్రైమ్ గురించి ఓ పుస్తకం రాయాలి అనుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ గోవిని తన కెరీర్ లో మరచిపోలేని క్రైమ్ ఏదైనా ఉంటే చెప్పమంటాడు. బాగా ఆలోచించిన గోవి తనకే షాక్ ఇచ్చిన ఓ క్రైమ్ ఉందని చెప్పడంతో కథ స్టార్ట్ అవుతుంది.
ఓ పెద్ద ఇళ్లు. ఆ ఇంట్లో రాబర్ట్ (చిత్రం శ్రీను), అతని భార్య అరుణ కుమారి ( నిహారిక ), పెద్ద కొడుకు వాసుదేవ్ (యోగి) కూతురు వైశాలి (వర్ష), చిన్న కొడుకు ఉంటారు. అయితే.. ఈ కుటుంబంలోని నలుగురు కుటుంబ సభ్యులు ఐదవ వాడైన చిన్న కొడుకును చంపాలనుకుంటారు. ఎవరికి వాళ్లు ప్రయత్నిస్తుంటారు కానీ.. ఫెయిల్ అవుతుంటారు. చిన్నవాడైన ఆ కుర్రాడిని కుటుంబ సభ్యులే ఎందుకు చంపాలి అనుకుంటున్నారు..? ఆ పిల్లాడు చేసిన తప్పేంటి..? ఆ కుటుంబానికి ఐపీఎస్ ఆపీసర్ గోవికి ఉన్న లింకు ఏంటి అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ - గోవి క్యారెక్టర్ లో మను పాత్రకు తగినట్లుగా మంచి విలనీని చూపించాడు. అలాగే ఆనంద్ భారతి క్యారెక్టర్ చిన్నదే అయినప్పటికీ ఇంపాక్ట్ కలిగించింది. రాబర్ట్ గా చిత్రం శ్రీను ఓ వైపు విలనిజాన్ని, మరో వైపు పశ్చాతాపం పడే సన్నివేశాల్లో బాగా నటించాడు. ఇక అరుణ కుమారి క్యారెక్టర్ లో మెప్పించింది. నిహారిక అలాగే వాసుదేవ్ గా యోగి, వైశాలిగా వర్ష బాగా పర్మార్స్ చేశారు. 360 డిగ్రీల స్క్రీన్ ప్లే కాబట్టి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఒకేసారి చూపించారు. శుభం కార్డ్ తో ఈ సినిమా స్టార్ట్ కావడం విశేషం.
360 డిగ్రీల స్క్రీన్ ప్లే కావడంతో మన బుర్రకు బాగా పదును పెడుతుంది అనుకుంటే పొరపాటే. అంతగా బుర్ర చించుకోవాల్సిన విధంగా ఏమీ లేదు కానీ.. అసలు ఏం జరుగుతోంది..? కుటుంబ సభ్యులే ఆ పిల్లాడిని ఎందుకు చంపాలనుకుంటున్నారే అనే ఉత్కంఠను దర్శకుడు అ శేఖర్ యాదవ్ బాగా మెయిన్ టైన్ చేశాడని చెప్పచ్చు. ఓ చిన్న పాయింట్ ను తీసుకుని దానిని ఇంట్రస్టింగ్ స్ర్కీన్ ప్లే తో రక్తికట్టించేలా తెరకెక్కించారు.
క్రైమ్, సస్పెన్స్, హర్రర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. అది గ్రహించిన దర్శకుడు ప్రతి సీన్ కి పర్ ఫెక్ట్ అనేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సంగీత దర్శకుడు సుభాష్ ఇషాన్ ను నుంచి రాబట్టాడు. కెమెరా వర్క్ బాగుంది. అయితే.. ఈ సినిమాకి మైనస్ ఏంటంటే.. సాగదీయం ఎక్కువైంది. అలా కాకుండా ట్రిమ్ చేస్తే కథలో స్పీడు కనిపిస్తుంది. ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పులి వచ్చింది మేక చచ్చింది ఓ మంచి ప్రయత్నం.