English   

బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి ఫిక్స్

Punarnavi
2020-10-29 11:59:06

ఉయ్యాల జంపాల సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పునర్నవి భూపాలం. ఈ సినిమాలో హీరోయిన్ అవికా గోర్ కంటే ఆమె పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన పునర్నవియే అందంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఇక ఆతరువాత పునర్నవి పలు సినిమాల్లో నటించి అలరించింది. పిట్ట గోడ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమాల విషయం పక్కన పెడితే పునర్నవి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత మరింత పాపులారిటీని సంపాదించుకుంది. హౌస్ లో రాహుల్ సిప్లింగజ్ తో లవ్ ట్రాక్ కూడా నడిపించింది. రాహుల్ బిగ్ బాస్ విన్నర్ కావడం కూడా వారి లవ్ ట్రాక్ వల్లనే అంటూ టాక్ కూడా వచ్చింది. 

హౌస్ నుండి బయటకు వచ్చిన పునర్నవి మరియు రాహుల్ అనేక షోస్ లో కనిపించి ప్రేక్షకులకు మంచి జోడీ అనిపించుకున్నారు. అయితే రాహుల్ మరియు పునర్నవి మాత్రం తమ మధ్య ఏమీ లేదని జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా తాజాగా పునర్నవి తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. "ఫైనల్లి ఇట్స్ హపెనింగ్" అంటూ తనకు ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని వెల్లడించింది. అంతే కాకుండా ఒకరి చేయి పట్టుకున్న ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. అయితే ఆ ఫొటోలో పునర్నవి ఎవరి చేయి పట్టుకుంది అనేది క్లారిటీ ఇవ్వలేదు.

More Related Stories