English   

పూరీ కూడా ఛలో అంటున్నాడు

Puri Jagannadh and akash puri

ఒకప్పుడు తెలుగులో ఓ సామెతకు అనుగుణంగా పరిశ్రమలో సినిమా తీసి చూడు అనే మాట వాడుకలో ఉండేది. కానీ ఇప్పుడుదానికి ఇప్పుడు ఎక్సెటెన్షన్ గా సినిమా తీసి చూడు విడుదల చేసి చూడు అంటున్నారు. ఇంకా చెప్పాలంటే సినిమా తీయడం కంటే ప్రమోషన్ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది. ఆ ప్రమోషన్ హిట్ అయితేనే ఆడియన్స్ లో సినిమాచూడాలన్న కోరిక పెరిగేది. అందుకే ప్రమోషన్స్ ఇప్పుడు స్టార్ హీరోలు కూడా దిగి వస్తున్నారు. లేటెస్ట్ గా పూరీ జగన్నాథ్ తనయుడితో తీసిన మెహబూబా సమ్మర్ రిలీజ్ గా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న  ఈమూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ లోగా ఓ ట్రైలర్ లేదా సాంగ్స్ ను రిలీజ్ చేసి స్ట్రాంగ్ ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నారట.

ఈ మధ్య కాలంలో ప్రమోషన్స్ తో ఆకట్టుకున్న సినిమా ఛలో. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నీ తిరగేశాడు నాగశౌర్య. ముఖ్యంగా యూత్ ను అట్రాక్ట్ చేసే పనిలో భాగంగా ఆయా నగరాల్లోని బెస్ట్ కాలేజెస్ ను సందర్శించి సినిమాకు ప్రమోషన్ చేశారు. ఇప్పుడిదే ఫార్ములాను మెహబూబా టీమ్ ఫాలో కావాలనుకుంటోంది. ఇందుకోసం ఆల్రెడీ రూట్ మ్యాప్ కూడా సిద్ధమైందని చెబుతున్నారు. మెహబూబా కూడా లవ్ స్టోరీనే. పైగా బోర్డర్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. టీజర్ ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. ట్రైలర్ తర్వాత ఓ అంచనా వస్తుంది. ఆ అంచనాను భారీ స్థాయిలో పెంచి ప్రమోషన్స్ కు వెళ్లాలనే ప్లానింగ్ లో ఉంది మెహబూబా టీమ్. మరి ఛలో లాగా మెహబూబాకూ ఈ రూట్ కలిసొస్తుందా అనేదిచూడాలి.
 

More Related Stories