English   

పూరీకి ఆప్ష‌న్ లేదు.. మ‌ళ్లీ త‌న‌యుడే..!

Puri-Jagan
2018-06-22 18:13:35

ఒక‌ప్పుడు ఎలా ఉన్నాడు అనేది కాదు. ఇప్పుడు నువ్వేంటి అనేది కావాలి. ఇండ‌స్ట్రీలో గ‌తం కంటే ప్ర‌స్తుతం ముఖ్యం. ఇప్పుడు నువ్వు తోపు అయితే గ‌తం ఎలా ఉన్నా ప‌ర్లేదంటారు ఇక్క‌డ‌. కానీ గతంలో నేను తోపు అంటే.. ఎవ‌రికి కావాలి అనే ర‌కాలుంటారు ఇక్క‌డ‌. ఇప్పుడు పూరీ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ హిట్లు ఇచ్చిన ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు ప్లాపుల్లో ఉన్నాడు. కొన్నేళ్లుగా ఈయ‌న నుంచి సినిమాలు వ‌స్తున్నాయి కానీ ఏదీ నిల‌బ‌డటం లేదు. మొన్నొచ్చిన మెహ‌బూబా కూడా డిజాస్ట‌ర్ గానే నిలిచింది. అందులో త‌న‌యుడికి కూడా హిట్ ఇవ్వ‌లేకేపోయాడు పూరీ. ఇక ఇప్పుడు మ‌రో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు ఈయ‌న‌. నాని.. నాగార్జున లాంటి హీరోల‌కు క‌థ‌లు చెప్పాడ‌నే టాక్ వ‌చ్చింది కానీ అవేవీ కావు మ‌ళ్లీ త‌న‌యుడితోనే సినిమా అంటూ ఇప్పుడు క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చింది. ఆకాశ్ తోనే మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ సారి పూర్తి క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌తో వ‌స్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. మెహ‌బూబాలో త‌న‌కు అల‌వాటు లేని పున‌ర్జ‌న్మ‌.. ప్రేమక‌థ లాంటి జోన‌ర్స్ ట‌చ్ చేసాడు పూరీ. కానీ ఇప్పుడు అవి కాకుండా త‌న స్టైల్ లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు పూరీ. ఆకాశ్ ను ఎలాగైనా హీరోగా నిల‌బెట్టాల‌ని చూస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి వార‌సున్ని క‌నీసం ఈ సారైనా హిట్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాడో లేదో పూరీ జ‌గ‌న్నాథ్.. చూడాలిక‌..!
 

More Related Stories