English   

హీరోయిన్లు పెళ్లి చేసుకోవ‌డం న‌చ్చ‌దంటున్న పూరీ

puri jagannadh
2021-06-17 15:53:13

తెలుగు సినీ పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ది ప్రత్యేకమైన శైలి. విజయాలను అపజయాలను ఒకే రకంగా స్వీకరిస్తూ మిగ‌తా ద‌ర్శ‌కుల‌కు భిన్నంగా ఆలోచిస్తుంటారు. పూరి తన సినిమాలతోనే కాకుండా తన ఆలోచనలను పూరీ మ్యూజింగ్స్ అనే ఛాన‌ల్ ద్వారా భ‌య‌ట‌పెడుతున్నారు. ఇప్ప‌టికే త‌న ఛాన‌ల్ ద్వారా అనేక విష‌యాలు చెప్పిన పూరీ తాజాగా....సినిమా హీరోయిన్ల గురించి వారి వివాహ జీవితం గురించి చెప్పడం జరిగింది. ఇక పూరీ హీరోయిన్ ల విహాహాల గురించి ఏమ‌న్నారో ఇప్పుడు చూద్దాం. 

హీరోయిన్స్‌ పెళ్లిళ్లు చేసుకుంటే నాకెందుకో నచ్చదు. ఎందుకంటే కోటిమందిలో ఒకరికి నటిగా మారే అవకాశం లభిస్తుంది. అందుకే వాళ్లు చాలా స్పెషల్‌. వాళ్లు కూడా అందరిలాగే పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కంటే నాకు నచ్చదు. హీరోయిన్స్‌ని తమ అభిమానులు దేవతల్లా భావిస్తుంటారు. అలాంటి దేవతలు పురిటి నొప్పులు పడుతుంటే చూడలేను. మనందరం పూజించే నిజమైన దేవతలు కూడా ఎప్పుడూ పిల్లల్ని కనలేదు. పిల్లల్ని కనాలనే కోరిక మనుషులకు ఉంటుంది. దేవతలకు కాదు. కాబట్టి, మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోకుండా దేవతల్లా ఉంటే మాకిష్టం. సాధారణ అమ్మాయిలతో పోల్చుకుంటే వ్యక్తిగతంగా మీరు ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటారు. మీరైనా మగవాడిని దూరం పెట్టవచ్చు కదా..! ప్రేమ లే చ‌చ్చిపోతారా అంటూ ప్ర‌శ్నించారు. ఇక ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. 

More Related Stories