English   

పీరియడ్స్ సమయంలో ఈ బియ్యం తినండి..పూరి హెల్త్ టిప్

puri jagannadh
2021-05-13 14:39:20

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. బద్రి సినిమాతో కెరీర్ మొదలు పెట్టి ఇప్పటి వరకు ఎన్నో సినిమా చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక ప్రస్తుతం పూరీ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో "లైగర్" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే పూరి సినిమాలతో పాటు సమయం దొరికినప్పుడల్లా తన పూరి మ్యుజింగ్స్ అనే యుట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే పూరి తాజాగా రాజముడి బియ్యం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒక్కప్పుడు మన దేశంలో లక్ష వరకూ బియ్యం రకాలు ఉండేవని చెప్పారు. అయితే ప్రస్తుతం మాత్రం కేవలం ఆరు వేల రకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అన్నారు. వాటిలో ఒకటి రాజముడి బియ్యమని అన్నారు. పీరియడ్ సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గాలంటే మహిళలు ఈ బియ్యం తినాలని పూరి జగన్నాథ్ సూచించారు. ఈ బియ్యం తినడం వల్ల రోగ నిరోధక శక్తికూడా పెరుగుతుందన్నారు. దాంతో ఎన్నో రకాల రోగాలు దూరమవుతాయని పూరి వెల్లడించారు. షుగర్ పేషంట్ లు కూడా ఈ బియ్యం తినడం ఎంతో మంచిదని చెప్పారు. ఈ బియ్యాన్ని కర్ణాటకలో పండించేవారని ఒకప్పుడు డబ్బుకు బదులుగా ఈ బియ్యాన్ని ఇచ్చేవారని పూరి చెప్పారు.

More Related Stories