English   

ఆఖ‌రికి పూరీ కూడా అదేనా..? 

Puri-Jagannath
2018-07-02 08:31:12

పూరీ జ‌గ‌న్నాథ్.. ఈ పేరుకు ఓ చ‌రిత్ర‌.. స్టార్ డ‌మ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడేమో కానీ పూరీ అంటే ఎప్ప‌టికీ స్టార్ డైరెక్ట‌రే. ఒక్క హిట్ కొడితే మ‌ళ్లీ ఆయ‌న తోపే. కానీ ఏం చేస్తాం.. ఎంత‌టి ద‌ర్శ‌కుడికైనా త‌ప్ప‌దు ఇలాంటి ప‌రిస్థితి. వ‌ర‌స‌గా ప‌రాజ‌యాలు రావ‌డంతో ఇప్పుడు పూరీ కూడా త‌న‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వండి అంటున్నాడు. హీరోల‌ను అడిగే ప‌రిస్థితికి వ‌చ్చేసాడు. ఇది నిజంగా ఆయ‌న అభిమానుల‌కు షాకింగ్ గానే ఉంది. మొన్న‌టికి మొన్న హ‌రీష్ శంక‌ర్ ఇలాగే చేసాడు. నిర్మాత‌లు.. హీరోల‌ను త‌న‌తో సినిమా చేయాలంటూ అడిగాడు. ఇక ఇప్పుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూడా ఇదే చేసాడు. పంతం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో త‌న‌కు గోపీచంద్ తో మ‌రో సినిమా చేయాల‌ని ఉంద‌ని చెప్పాడు. స‌భాముఖంగా గోపీని అడిగాడు. గోలీమార్ తో గోపీచంద్ కు కోరుకున్న విజ‌యం ఇవ్వ‌లేక‌పోయాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఆ బాకీ తీర్చాల‌ని చూస్తున్నాడు. అయితే పూరీ జ‌గ‌న్నాథ్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ ను గోపీచంద్ లాంటి హీరోలు త‌మ‌తో సినిమా చేయాల‌ని అడ‌గాలి కానీ పూరీనే రివ‌ర్స్ లో అడ‌గ‌టం మాత్రం బాధాక‌ర‌మే. మ‌రి ఈ ద‌ర్శ‌కుడి టైమ్ ఎప్పుడు ట‌ర్న్ అవుతుందో.. మ‌ళ్లీ పూరీ ఈజ్ బ్యాక్ అని ఎప్పుడు అనిపించుకుంటాడో..? ఆ మ‌ధ్య కొడుకుతో చేసిన మెహ‌బూబా కూడా అడ్ర‌స్ లేకుండా పోయింది. మ‌రి చూడాలిక‌.. ఈ ద‌ర్శ‌కుడి టైమ్ మార్చే హీరో ఎక్క‌డున్నాడో..? 

More Related Stories