English   

కొడుక్కి అన్యాయం చేసిన పూరీ.. 

Puri-Jagannadh
2018-05-16 07:17:57

పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా అంటే ఒక‌ప్పుడు క‌నీసం గుర్తింపు ఉండేది.. ఆయ‌న సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ కు అయితే ఢోకా ఉండేది కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఏ ద‌ర్శ‌కుడికైనా ఓ టైమ్ పీరియ‌డ్ అనేది ఉంటుంది. అప్పుడు వాళ్లేం చేసినా చెల్లుతుంది. కానీ ఓ టైమ్ దాటాక ఆ అదృష్టం అనేది ఉండ‌దు. ఇప్పుడు పూరీ ప‌రిస్థితి కూడా ఇంతే. ఈయ‌న టైమ్ బాగున్న‌పుడు యావ‌రేజ్ సినిమాలు ఆడేసాయి. కానీ ఇప్పుడు ఆ ల‌క్ లేదు. పైగా ఈయ‌న నుంచి సినిమాలు కూడా చెప్పుకోద‌గ్గ‌వి రావ‌డం లేదు. ఇప్పుడు వ‌చ్చిన మెహ‌బూబా కూడా అంతే. తాను మారాను అని నిరూపించుకోడానికి ఏదో డిఫెరెంట్ గా ట్రై చేసాడే కానీ కొడుకును స‌రిగ్గా లాంచ్ చేస్తున్నాడా లేదా అనేది మాత్రం చూసుకోలేదు పూరీ. ఏదో ఐడియా వ‌చ్చేసింది క‌దా వెంట‌నే సీన్ పేప‌ర్ వేసుకుని సినిమా తీసిన‌ట్లుగా ఉంది కానీ పున‌ర్జ‌న్మ‌ల కాన్సెప్ట్ ను స‌రిగ్గా వాడుకుంటే అద్భుతాలు చేయొచ్చ‌నే విష‌య‌మే మ‌రిచిపోయాడు పూరీ. అస‌లు అర్థం ప‌ర్థం లేని స్క్రీన్ ప్లేతో కొడుకు లాంచింగ్ ను కూడా చెడ‌గొట్టేసాడు పూరీ. ఇప్పుడు ఈ కుర్రాడికి బ్రేక్ రావ‌డానికి ఎంత కాలం ప‌డుతుందో ఏమో..? ఇప్ప‌డున్న ప‌రిస్థితుల్లో పూరీ నుంచి అద్భుతాలు ఆశించ‌డం మాత్రం అత్యాశే. మ‌రి చూడాలిక‌.. త‌న కుమారుడికి పూరీ ఇచ్చే ప్ర‌తిఫ‌లం ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories