English   

పూరీని ఆయ‌నిప్పుడు న‌మ్ముతాడా..? 

puri
2018-07-27 08:51:43

పూరీ జ‌గ‌న్నాథ్ తో సినిమా అంటే ఒక‌ప్పుడు స్టార్ హీరోలు ఎగిరి గంతేసే వాళ్లు కానీ ఇప్పుడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు. ఒక్క ఫ్లాప్ వ‌స్తేనే హీరోలు ఛాన్స్ ఇవ్వ‌డానికి భ‌య‌ప‌డ‌తారు.. అలాంటిది వ‌ర‌స‌గా ఫ్లాపుల దండ‌యాత్ర చేస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఈయ‌న రాసుకున్న క‌థ‌లేవీ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌డం లేదు. టెంప‌ర్ త‌ర్వాత మ‌రో హిట్ లేదు ఈ ద‌ర్శ‌కుడికి. అది కూడా ఆయ‌న క‌థ కాదు. ఇప్పుడు కూడా ఇదే చేయాల‌ని చూస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. త‌ను కథ కాకుండా మ‌రో మంచి క‌థ తీసుకుని హీరోల ద‌గ్గ‌రికి వెళ్తున్నాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ను టెక్నిక‌ల్ గా త‌ప్పు ప‌ట్ట‌లేం. ఈయ‌న డైరెక్ట‌ర్ గా ఇప్ప‌టికీ తోపే.. కాక‌పోతే క‌థల ప‌రంగానే షాక్ తింటున్నాడు. 

టెంప‌ర్ కు వ‌క్కంతం వంశీ ఇచ్చిన క‌థ‌ను త‌న మాట‌ల‌తో ర‌క్తి క‌ట్టించాడు పూరీ. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ కెరీర్ మారిపోయింది. ఇక ఇప్పుడు ఇలాంటి మ‌రో మంచి క‌థ‌ను రాయించుకుని బ‌న్నీతో సినిమా కోసం ట్రై చేస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఈయ‌న కూడా దీనికి సై అంటున్నాడ‌ని తెలుస్తుంది. ఎంద‌కుంటే ఈ కాంబినేష‌న్ లో వ‌చ్చిన దేశ‌ముదురు సూప‌ర్ హిట్.. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో అబౌ యావ‌రేజ్. ఇప్పుడు మూడోసారి మ‌రో హిట్ కొట్టాలని చూస్తున్నారు. బ‌న్నీ కూడా మంచి క‌థ దొరికితే చేస్తాన‌ని మాట ఇచ్చాడు పూరీకి. మ‌రి చూడాలిక‌.. అల్లు వార‌బ్బాయి ఇచ్చిన వ‌రాన్ని పూరీ ఎంత‌వ‌ర‌కు నిల‌బెట్టుకుంటాడో..?
 

More Related Stories