English   

పూరీతో నానినా.. న‌మ్మొచ్చా..? 

Puri-Jagannath-Nani
2018-06-21 19:00:30

పూరీ జ‌గ‌న్నాథ్.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈయ‌న పేరు ఓ సంచ‌ల‌నం. ఒక‌ప్పుడు వ‌ర‌స విజ‌యాల‌తో దున్నేసిన ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికీ ఈయ‌నంటే మంచి ఇమేజ్ ఉంది. హిట్లు లేకపోయినా.. స్టైలిష్ మేకింగ్ తో హీరోల్ని ప‌డేసే టాలెంట్ పూరీ సొంతం. అయితే ఈ మ‌ధ్య పూరీ ఇమేజ్ దారుణంగా ప‌డిపోయింది. ఆయ‌న కెరీర్ గ్రాఫ్ కూడా వ‌ర‌స ఫ్లాపుల‌తో నిండిపోయింది. గ‌త కొన్నేళ్ల‌లో ఒక్క టెంప‌ర్ మిన‌హా.. పూరీ కెరీర్ లో చెప్పుకోద‌గ్గ సినిమా లేదు. టెంప‌ర్ కూడా యావ‌రేజ్ గానీ హిట్ కాదు. ఇక లోఫర్, జ్యోతిల‌క్ష్మి, పైసావసూల్, ఇజం, రోగ్.. మొన్న‌టికి మొన్న కొడుకుతో చేసిన మెహ‌బూబా.. ఇలా అన్నీ డిజాస్ట‌ర్లే. పూరీ జ‌గ‌న్నాథ్ స్థానంలో మ‌రో ద‌ర్శ‌కుడు ఉంటే.. ఆయ‌న తిన్న దెబ్బ‌ల‌కు ఎప్పుడో కింద ప‌డిపోయేవాడు. కానీ పూరీ కాబ‌ట్టి నిల‌బ‌డ్డాడు. ఫ్లాప్ వ‌చ్చిన ప్ర‌తీసారి పైకి లేవ‌డం పూరీ అల‌వాటు. ఆయ‌న ఎప్పుడు బాక్సాఫీస్ ను బ‌ద్ద‌లు కొడ‌తాడో తెలియ‌దు గానీ కొడితే మాత్రం మామూలుగా ఉండ‌దు. అందుకే పూరీ ప్ర‌తీ సినిమాపై అంచ‌నాలు అదే స్థాయిలో ఉంటాయి. ఇక ఇప్పుడు ఈయ‌న ఏకంగా నానికి ఓ క‌థ చెప్పాడ‌ని.. దానికి న్యాచుర‌ల్ స్టార్ కూడా ఓకే అన్నాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న ఆయ‌న‌కేం చెప్పాడో.. నాని ఎందుకు ఓకే అన్నాడో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. అస‌లే ఎనిమిది విజ‌యాల త‌ర్వాత ఈ మ‌ధ్యే కృష్ణార్జున యుద్ధంతో ఫ్లాప్ ఇచ్చాడు నాని. ఇలాంటి టైమ్ లో జాగ్ర‌త్త‌గా లేక‌పోతే కెరీర్ మ‌ళ్లీ డైల‌మాలో ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. మ‌రి చూడాలిక‌.. ఈ నాని-పూరీ క‌థేంటో.?? 

More Related Stories