English   

తండ్రి వద్దన్నా కొడుకు సరేనన్నాడు...13 ఏళ్ళ తర్వాత మళ్ళీ 

 Puri Jagannath
2020-08-04 10:20:54

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టడమే కాక, ఆ తదనంతరం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దాదాపు అందరు హీరోల గురించి మాట్లాడి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయాడు పూరీ జగన్నాధ్. పూరీ రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపింది. చాన్నాళ్ళగా పూరీ రామ్ లు హిట్ కోసం ఎంత పరితపిస్తున్నారో అంతకు మించి మాస్ ఆడియెన్స్ ఒక మాస్ సినిమా కోసం ఎదురు చూస్తుండడంతో ఈ సినిమా బంపర్ హిట్ గా నిలిచింది. దీంతో పూరీ ట్రాక్ లో పడ్డట్టే, మహేష్ మీద కామెంట్స్ చేసి ఆయన ఆగ్రహానికి గురయిన పూరీ మహేష్ మళ్ళీ పూరీ అంటే ఇష్టం అని చెప్పడంతో ఆ వ్యవహారాలు క్లియర్ అయ్యాయి. 

అయితే పూరి జ‌గ‌న్నాథ్‌తో ఇంత‌కు ముందే మెగాస్టార్ రీ ఎంట్రీగా 150 వ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం వ‌చ్చింది. ఆటో జానీ పేరిట ప్రచారం జరిగిన ఆ సినిమా సెకండ్ హాఫ్ నచ్చలేదనే కారణంతో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశం చేజారింది. దీంతో చిరంజీవికి పూరి జ‌గ‌న్నాథ్‌కు చెడింద‌నే ప్ర‌చారం సాగింది. అయితే అప్పట్లో తండ్రి కాదన్నా ఇప్పుడు కొడుకు చరణ్ పూరితో ఓ సినిమాకి ఓకే చెప్పాడట. అయితే ఇది పూరీ చిరుకి చెప్పిన స్క్రిప్టేనా? లేక కొత్తదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్‌ లో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్‌ సినిమాలో అజయ్‌ దేవగన్‌, సముద్రఖని కీలక పాత్రధారులుగా, అలియాభట్‌, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  
 

More Related Stories