English   

పుష్ప రిలీజ్ డేట్ లో మార్పులు..కొత్త డేట్ ఇదే

Pushpa
2021-04-10 13:30:00

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సినిమా టీజర్ ను విడుదల చేయగా టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. ప్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ను ఆగస్టు 13 న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా  రిలీజ్ డేట్ ను వాయిదా వేయాలని సుకుమార్ భావిస్తున్నారట. అంతే అక్టోబర్ 13 న దసరాకు విడుదల చేయాలని అనుకున్నారట కానీ అప్పటివరకు కూడా షూటింగ్ పూర్తి చేయడం కష్టమేనని సుకుమార్ అనుకుంటున్నారు. అంతే కాకుండా డిసెంబర్ 17 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. క్రిస్మస్ సందర్భంగా వీకెండ్ లో సినిమాను విడుదల చేస్తే కలిసి వస్తుందనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.

More Related Stories