English   

పుష్ప షూటింగ్ కు కరోనా ఎఫెక్ట్

Pushpa
2020-12-03 17:38:39

అలా వైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప" సినిమాలో  నటిస్తున్నాడు. ఈ సినిమాతో మరో సాలిడ్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆర్య, ఆర్య-2 సినిమాలతో అల్లు అర్జున్ కు హిట్స్ ఇచ్చిన సుకుమార్ పుష్ప సినిమాతో మరో హిట్ ఇస్తారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పుష్ప పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కుతోంది. పుష్పలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పుష్ప షూటింగ్ మారేడ్పల్లి అడవుల్లో జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారట. యూనిట్ సభ్యుల్లో ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడం తో షూటింగ్ ను నిలిపివేశారట. అతడికి కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చినప్పటికీ షూటింగ్ లో పాల్గొన్న 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో షూటింగ్ నిలిచిపోయింది.

More Related Stories