English   

నాగ్ చేతుల మీదుగా కార్ గిఫ్ట్

PV Sindhu
2019-09-14 15:36:35

స్విట్జర్లాండ్ లో జరిగిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధు అనేక ప్రసంశలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆమె ఆ ఘనత సాధించిన తొలి భారతీయ యువతిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో ఆమెకు భారత ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు సహా ఎంతో మంది అభినందించారు. ఇక ఆమెకు ప్రశంసలే కాక నజరానాలు కూడా ప్రకటిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెట్ బోర్డ్ చైర్మన్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ ఆమెకు ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహూకరించనున్నారు. 

ఈరోజు మధ్యాహ్నం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు నాగార్జున హాజరుకానున్నారు.  కారు బహుకరణ ముగిసిన తర్వాత సింధు, చాముండేశ్వరీ నాథ్, నాగార్జున ప్రసంగించనున్నారు. అయితే చాముండి గతంలో ఇలానే క్రీడలలో అసమాన ప్రతిభ చూపిన చాలామందికి కార్లు బహుకరించారు. ఇక మరో పక్క బ్యాడ్మింటన్ అకాడెమీ కోసం విశాఖపట్నంలో సింధుకు ఏపీ సీఎం జగన్ 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

More Related Stories