English   

శ్రీ‌దేవి.. క్వీన్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా..

Queen of indian cinema Sridevi

ఓ హీరోయిన్ గురించి చెప్పాలంటే ఈమె ఇక్క‌డ నెంబ‌ర్ వ‌న్.. అక్క‌డ నెంబ‌ర్ వ‌న్ అని చెప్తారు. కానీ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నెంబ‌ర్ వ‌న్ అని చెప్పే హీరోయిన్ మాత్రం ఒక్క‌రంటే ఒక్క‌రే ఉన్నారు. ఆమె శ్రీ‌దేవి.. ఉర‌ఫ్ క్వీన్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా. ద‌క్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్క‌డ ఒక్క ఆఫ‌ర్ సంపాదించ‌డమే అనూహ్యం అనుకుంటే.. అక్క‌డే ఉండి రేఖ‌, మాధురి లాంటి స్టార్ హీరోయిన్ల‌ను కూడా త‌న అందంతో మైమ‌రిపించి.. ప‌క్క‌కు నెట్టేసి నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అనిపించుకుంది శ్రీ‌దేవి. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు లాంటి ఆ త‌రం న‌టుల నుంచి..  చిరంజీవి, నాగార్జున, వెంక‌టేశ్ లాంటి ఈ త‌రం న‌టుల వ‌ర‌కు అంద‌రితోనూ ఆడిపాడిన ఏకైక హీరోయిన్ శ్రీ‌దేవి.

ఇక త‌మిళ‌నాట కూడా ర‌జినీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, విజ‌య్ కాంత్ లాంటి స్టార్ హీరోల‌తో ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ‌. త‌మిళ‌నాట కూడా నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అనిపించుకుంది. ఒకానొక టైమ్ లో శ్రీ‌దేవికి ఎదురొచ్చే హీరోయిన్ ఇండియాలోనే లేరంటే అతిశ‌యోక్తి కాదు. హీరో ఎవ‌రైనా హీరోయిన్ మాత్రం శ్రీ‌దేవినే. ఎందుకంటే అప్ప‌ట్లో ఆమె అంత గ్లామ‌ర్ క్వీన్. శ్రీ‌దేవి అందం గురించి చెప్ప‌డానికి మాట‌లుండేవి కావు.. అందుకే అతిలోక‌సుంద‌రంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేసాడు. ఇక హిందీలో కూడా శ్రీ‌దేవి నెంబ‌ర్ వ‌న్ గా ఎదిగింది. అక్క‌డ నాగిని, మిస్ట‌ర్ ఇండియా, చాందిని, ఖుదాగ‌వా, తోఫా లాంటి ఎన్నో సంచ‌ల‌నాత్మ‌క సినిమాల‌తో అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. ఆసేతు హిమాచ‌లం తెలిసిన ఒకే ఒక్క హీరోయిన్ శ్రీ‌దేవి. అందుకే ఇప్పుడు గ‌ల్లీ టూ ఢిల్లీ వ‌ర‌కు అంతా శ్రీ‌దేవి మ‌ర‌ణానికి క‌న్నీరు పెట్టుకుంటున్నారు. ఎవ‌రేం అన్నా.. శ్రీ‌దేవి అంటే వ‌న్ అండ్ ఓన్లీ క్వీన్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా.
 

More Related Stories