English   

కుమార్ సాయిని కావాలనే ఇంటికి పంపించారా.. బిగ్ బాస్ ఎలిమినేషన్ పై నీలినీడలు..

Kumar Sai elimination
2020-10-19 12:52:32

బిగ్బాస్ సీజన్ ఫోర్ అనుకున్నదానికంటే బాగానే ప్రజల్లోకి వెళ్లిపోయింది. టిఆర్పి రేటింగ్స్ కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మా టీవీ ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ చానల్ గా ఎదిగింది. అందులో బిగ్ బాస్ పాత్ర కూడా చాలానే ఉంది. అయితే అంతా బాగానే ఉన్నా ప్రస్తుతం సీజన్లో ఎలిమినేషన్స్ పై మాత్రం చాలా అనుమానాలు అందరికీ వస్తున్నాయి. తమకు నచ్చిన వాళ్లని మాత్రమే ఇంట్లో ఉంచి నచ్చని వాళ్లను బలవంతంగా బయటకు గెంటేస్తున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అందులో నిజం కూడా లేకపోలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం కుమార్ సాయి ఎలిమినేట్ కావడమే దీనికి నిదర్శనం. మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఆయన అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు.. కానీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కూడా కాదు. 

గతంతో పోలిస్తే ఆయన చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. తన గ్రాఫ్ రోజు రోజుకి పెంచుకుంటూ వచ్చాడుఎం ఓ వారం కెప్టెన్ అయ్యాడు. దానికి తోడు టాస్క్ లలో అద్భుతంగా చేశాడు. ఇన్ని చేసినా కూడా ఈ వారం కుమార్ బయటికి రావడం ఎవరికీ నచ్చడం లేదు. ఈయనను కావాలనే ఇంటి నుంచి బయటకు పంపించేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఓట్ల పరంగా చూసుకుంటే మోనాల్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని.. కానీ గ్లామర్ ఉంటుందని ఈమెను సేవ్ చేశారనే ప్రచారం జరుగుతోంది. దానికి తోడు కుమార్ కు ఇంట్లో గ్రూపులు లేవు. ఏం చేసినా ఒక్కడే చేశాడు.. ఒంటరిగా వచ్చాడు.. అలాగే ఒంటరిగా వెళ్లిపోయాడు.. ఈయన వల్ల అనుకున్న కంటెంట్ రావడంలేదని బలవంతంగా ఒక మంచి కంటెస్టెంట్ ను బయటకు పంపించేశారని సోషల్ మీడియాలో నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకోండి ఇక ఓట్లు వేయడం ఎందుకు అంటూ మండిపడుతున్నారు. మూడో వారం దేవి నాగవల్లి ఎలిమినేట్ అయినప్పుడు ఇలాంటి ప్రచారం జరిగింది. ఇప్పుడు కుమార్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుంది. 

More Related Stories