English   

ర‌త్తాలుతో చిరంజీవి.. మెగా విందులో ల‌క్ష్మీరాయ్.. 

Raai-Laxmi
2018-09-22 18:03:09

ర‌త్తాలు ర‌త్తాలు అంటూ చిరంజీవితో క‌లిసి ర‌ప్ఫాడించింది ల‌క్ష్మీరాయ్. ఆ మ‌ధ్య తెలుగులో వ‌ర‌సగా ఐటం సాంగ్స్ చేసి ఐటం క్వీన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే కొన్ని రోజులుగా మ‌ళ్లీ సైలెంట్ అయిపోయింది ల‌క్ష్మీ. కానీ బాలీవుడ్ లో మాత్రం అవ‌కాశాల కోసం చూస్తూనే ఉంది. ఆ మ‌ధ్య జూలీ 2 అంటూ బి గ్రేడ్ సినిమా ఒక‌టి చేసింది. ఇందులో పూర్తిగా హాట్ సీన్స్ తో ర‌చ్చ చేసింది. అప్ప‌టి వ‌ర‌కు ఎంత రెచ్చిపోయినా కూడా ఓ బోర్డ‌ర్ పెట్టుకున్న ఈ బ్యూటీ.. జూలీ 2తో కంచె పూర్తిగా తెంచేసింది. ఇక ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది ల‌క్ష్మీరాయ్. ఈమె చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ త‌న హీరోను క‌లుసుకుంది. అదేనండీ.. మెగాస్టార్ చిరంజీవిని. ప్ర‌స్తుతం వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి సినిమాలో న‌టిస్తుంది ల‌క్ష్మీరాయ్. ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. 

ఈ మ‌ధ్యే మరో షెడ్యూల్‌ పూర్తయింది. దాంతో చిరు ఇంటికి వెళ్లింది ఈ భామ‌. అక్క‌డే చాలా సేపు ఉండి.. త‌న ఆనందాన్ని పంచుకుంది. అలాగే చిరు ఆతిథ్యాన్ని కూడా స్వీక‌రించింది. ఇదే విష‌యాన్ని ట్వీట్ చేస్తూ చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైన చిరంజీవి సర్‌.. ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసాను. వారిని కలిసినప్పుడు తిరిగి ఇంటికి వచ్చిన భావన కలిగింది. మీ సమయాన్ని నాతో గడిపినందుకు ధన్యవాదాలు. యమ్మీ ఫుడ్‌ వండిన సురేఖ గారికి.. నాకు అద్భతమైన కంపెనీ ఇచ్చిన సుస్మితకు థాంక్స్‌. ఈ కుటుంబంతో విలువైన సమయం గడిపా. ఇలాంటి రోజులు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంటాయి.. అంటూ ట్వీట్ చేసింది ల‌క్ష్మీరాయ్. ఇక చిరు కూడా ర‌త్తాలుతో పోజ్ ఇచ్చి త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసాడు. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల సినిమాల్లోనూ న‌టిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌.

More Related Stories