English   

రాశిఖన్నాకు ఎన్టీఆర్ నుంచి పిలుపొచ్చింది

Raashi Khanna as Jaya Prada in Balakrishna's NTR Biopic
2018-08-18 02:43:10

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్, అండ్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ అంటే ‘‘ఎన్టీఆర్’’ సినిమా అనే చెప్పాలి. మహానటుడు నందమూరి తారకరామారావు బయోపిక్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రతి రోజు ఏదో రకంగా వార్తల్లో ఉంటోంది. బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే స్టార్ కాస్ట్ తో సర్ ప్రైజ్ చేస్తున్నారు. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ కన్ఫార్మ్ అయింది.

అయితే లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి బెల్లం శ్రీదేవి కూడా జాయిన్ అయిపోతోంది. కొన్నాళ్ల క్రితం కాస్త లావుగా ఉన్న ఈ భామ పర్సనాలిటీ తగ్గించుకుని సోకులు పెంచుకుని తొలిప్రేమతో రీ స్టార్ట్ అయింది. రీసెంట్ గా వచ్చిన శ్రీనివాసకళ్యాణం ఫ్లాప్ అయినా.. అమ్మడికి ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో ఛాన్స్ వచ్చింది. యస్.. రాశిఖన్నాకు ఎన్టీఆర్ నుంచి పిలుపొచ్చింది. మరి తను చేయబోయే పాత్రేంటో తెలుసా..

ఈ మూవీలో రాశిఖన్నా ఓ కీలకమైన పాటలో కనిపిస్తుంది. అదే ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అనే పాట. అంటే రాశి.. జయప్రద పాత్రలో కనిపించబోతోంది. యస్.. ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్ వచ్చాక.. అప్పటికి టీనేజ్ బ్యూటీస్ గా ఉన్న ఈ జయ ద్వయానికి మంచి డిమాండ్ వచ్చింది. జయప్రద, ఎన్టీఆర్ కాంబోలో మంచి సినిమాలే వచ్చాయి. అందులో యమగోల ఒకటి. అందులోని ఓ పాటనే రాశిఖన్నా, బాలయ్యపై చిత్రీకరిస్తారట. మరి ఇలాంటి ఛాన్స్ తను వదులుకుంటుందా.. అందుకే యస్ చెప్పింది. సో.. ఈ బెల్లం శ్రీదేవి త్వరలో జయప్రదగా మారబోతోందన్నమాట.

More Related Stories