English   

తొలిప్రేమ బ్యూటీకి బంపర్ ఆఫర్

Raashi-Khanna
2018-02-17 11:24:53

ఒక సినిమా హిట్ అయితే ఆఫర్స్ గురించి చెప్కక్కర్లేదు. కానీ రాశిఖన్నా సిట్యుయేషన్ వేరే. ఫస్ట్ మూవీతోనే కొట్టి టాలీవుడ్ లోకి హిట్ బోణీ చేసిన ఈ భామ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది. కానీ బాగా లావుగా మారిందనే కమెంట్స్ తో పాటు చేసిన సినిమాలు ఫెయిల్ అవుతుండటంతో ఇక రాశి పని ఐపోయిందనుకున్నారు చాలామంది. కానీ లేటెస్ట్ గా తొలిప్రేమతో తిరుగులేని హిట్ కొట్టడమే కాదు.. తనలో ఎంత టాలెంట్ ఉందో కూడా మళ్లీ చూపించింది. దీంతో ఇప్పుడు తొలిప్రేమ ఫేమ్ గా కొత్త ఆఫర్స్ మొదలయ్యాయి. వీటిలో ఇప్పుడు వినిపిస్తోన్న ఆఫర్ అమ్మడికి మరికొంతకాలం కెరీర్ ఇచ్చేదే అవుతుందంటే అతిశయోక్తి కాదు.. 

రాశిఖన్నాకు నితిన్ సరసన ఆఫర్ వచ్చింది. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ గా వినిపిస్తోన్న అప్డేట్. అది కూడా మళ్లీ దిల్ రాజ్ క్యాంప్ లో. యస్.. రీసెంట్ గా తొలిప్రేమలో హీరోయిన్ గా రాశిఖన్నా వద్దు అనుకున్నాను అన్న దిల్ రాజు ఇప్పుడా మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత తనే కావాలని పట్టుబడుతున్నాడట. దీంతో తను నితిన్ తో చేయబోయే సినిమాలో రాశినే హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ శతమానం భవతితో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కబోయే శ్రీనివాస కళ్యాణంలో రాశిఖన్నానే తీసుకున్నట్టు చెబుతున్నారు. నిజానికి ఈ మూవీలో ముందు ఛలో బ్యూటీ రష్మిక మందన్నను తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తొలిప్రేమతో గేమ్ చేంజ్ అయింది. లైన్ లోకి రాశి వచ్చినట్టు టాక్. ఏదేమైనా తొలిప్రేమ రాశిఖన్నాకు కొత్త కెరీర్ తెచ్చేలానే ఉంది.  

More Related Stories