English   

రాశిఖన్నా బంపర్ ఆఫర్ 

Raashi-Khanna
2018-03-22 10:50:47

ఏ టైమ్ లో తొలిప్రేమ చేసిందో కానీ రాశిఖన్నాకు ఆఫర్లు తెగ పెరుగుతున్నాయి. ఒంట్లోని కొవ్వును కూడా కరిగించుకున్న ఈ థైస్ బ్యూటీకి ఇప్పుడు కోలీవుడ్ లోనూ ఆఫర్స్ పెరుగుతున్నాయి. వరుసగా తెలుగులో సినిమాలు ఒప్పేసుకుంటోన్న రాశికి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. కోలీవుడ్ మాస్ స్టార్ విశాల్ హీరోగా తెరకెక్కబోతోన్న సినిమాలో రాశిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇది తెలుగులో ఎన్టీఆర్ చేసిన సూపర్ హిట్ మూవీ టెంపర్ కు రీమేక్. మరో విశేషం ఏంటంటే రాశి ఆల్రెడీ తమిళంలో సిద్ధార్థ్, జయం రవిల సరసన నటిస్తోంది. ఇది థర్డ్ మూవీ. ఈ మూడిట్లో ఏ రెండు హిట్ అయినా అమ్మడు అక్కడ ఈజీగా పాగా వేసేయొచ్చు. 

టెంపర్ లో హీరోయిన్ పాత్రకు మొదట్లో పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా ప్రీ క్లైమాక్స్ నుంచి ఆ పాత్రకు నటనకు మంచి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు తొలిప్రేమతో యాక్టింగ్ లోనూ ప్రూవ్ చేసుకుంది కాబట్టే రాశికి కొత్త ఆఫర్స్ పెరుగుతున్నాయంటున్నారు. మొత్తంగా తమిళ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ అసోసియేట్ వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఇలాంటి కథలకు రియలిస్టిక్ కోట్ అద్దడంలో కోలీవుడ్ స్టైల్ వేరు. అంటే టెంపర్ అక్కడ మరికాస్త రియలిస్టిక్ గా ఉంటుందనుకోవ్చచు. విశాల్ సరసన ఆఫర్ అంటే రాశి అక్కడ ఆల్మోస్ట్ స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయిపోయినట్టే. 

More Related Stories