English   

స‌ల్మాన్ కు షాక్ ఇచ్చిన రంజాన్  

Race-3-Movie
2018-06-16 09:09:23

స‌ల్మాన్ ఖాన్.. గ‌త కొన్నేళ్లుగా స్థిర‌మైన హిట్స్ తో దూసుకుపోతున్నాడు. అయితే త‌న సినిమాల‌న్నీ రంజాన్ సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డం అత‌న‌ని సెంటిమెంట్. కానీ ఈ సారి ఆ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. బాలీవుడ్ హిట్ సిరీస్ రేస్ కు థ‌ర్డ్ మూవీగా వ‌చ్చిన రేస్ -3 బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో త‌న రెగ్యుల‌ర్ సెంటిమెంట్ కు ఈ ఈద్ బ్రేక్ వేసింది. రేస్ మొద‌టి భాగం సూప‌ర్ హిట్ అయింది. త‌ర్వాత వ‌చ్చిన పార్ట్ కూడా ఆక‌ట్టుకుంది. దీంతో ఈ ఫ్రాంచైజీలోకి ఈ సారి స‌ల్మాన్ ఖాన్ ను తీసుకున్నారు. ఫ్యామిలీ ఈగోస్, అత్యాశ‌ల మ‌ధ్య న‌డిచే ఈ క‌థ‌కు మొద‌టి నుంచీ మంచి రెస్పాన్సే ఉంది. అయితే స‌ల్మాన్ తో చేసిన రేస్ -3కి ఆ టాక్ రాలేదు. రెమో డిసౌజా డైరెక్ట్ చేసిన‌ రేస్ -3 ఇవాళే విడుద‌లైంది.  ఫ్యాన్స్ సూప‌ర్ అంటున్నా.. జ‌న‌ర‌ల్ ఆడియ‌న్స్ మాత్రం యావ‌రేజ్ గా తేల్చేస్తున్నారు. అటు రివ్యూస్, అండ్ రేటింగ్స్ కూడా ఏమంత గొప్ప‌గా లేవు.  హెవీ డోస్డ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌చ్చిన ఈ సినిమాకు అవే మైనస్ గా మారాయంటున్నారు. రేస్ -3లో స‌ల్మాన్ తో పాటు బాబీడియోల్, అనిల్ క‌పూర్, జాక్వ‌లిన్ ఫ‌ర్నాండెజ్, డైసీ షా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించాడు. మొత్తంగా ఈ సారి రంజాన్ స‌ల్మాన్ కు షాక్ ఇచ్చింద‌నే కమెంట్స్ వినిపిస్తున్నాయి. 

More Related Stories