English   

స‌ల్మానా మ‌జాకా.. శాటిలైట్ లో రికార్డ్..!

salaman-khan
2018-05-07 17:36:57

ఒక‌ప్పుడు శాటిలైట్ రైట్స్ అంటే నిర్మాత‌ల‌కు కొస‌రు అంతే. సినిమా బ‌డ్జెట్ 10 కోట్లైతే.. శాటిలైట్ 10 ల‌క్ష‌లు వ‌చ్చేవి. కానీ రోజురోజుకీ అవి మారుతూ ఇప్పుడు సినిమా బ‌డ్జెట్ ను కూడా డామినేట్ చేసే స్థాయికి వ‌చ్చేసాయి. మ‌న దగ్గ‌రే ఒక్కో సినిమాకు 20 కోట్లు పెడుతున్నారు. ఇక బాలీవుడ్ లో ఆ రేంజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. అక్క‌డ స‌ల్మాన్ ఖాన్ అయితే ఇప్పుడు శాటిలైట్ లో కింగ్ అయిపోయాడు. ఈయ‌న రీసెంట్ మూవీ టైగ‌ర్ జిందా హైకు ఏకంగా 70 కోట్ల ధ‌ర ప‌లికింది. ఇక ఇప్పుడు ఈయ‌న రేస్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు. దీనికి 100 కోట్లు రేట్ పెట్టారు జీ గ్రూప్ ఛానెల్స్. ఒక్క సినిమా అయితే ప‌ర్లేదు వ‌ర‌స‌గా స‌ల్మాన్ త‌ర్వాత న‌టించ‌బోయే నాలుగు సినిమాల‌కు సంబంధించిన డీల్ ఇప్పుడే తెగ్గొట్టేసారు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 400 కోట్లకు ఈ బేరం తెగిన‌ట్లు తెలుస్తుంది. అంటే స‌గ‌టున ఒక్కో సినిమాకు 100 కోట్లు అన్న‌మాట‌. ఇండియాలో ఇదే ఇప్ప‌టి వ‌ర‌కు బిగ్గెస్ట్ శాటిలైట్ డీల్. ఆ మ‌ధ్య హృతిక్ రోషన్ నాలుగు సినిమాలకు కలిపి 300 కోట్ల శాటిలైట్ మాట్లాడుకుంటేనే అబ్బో అనుకున్నారు. కానీ ఇప్పుడు దానికంటే 100 కోట్లు ఎక్కువే లాగేస్తున్నాడు కండ‌ల‌వీరుడు. ప్రస్తుతం ఈయ‌న న‌టిస్తున్న రేస్-3 రంజాన్ కు రిలీజ్ కానుంది. రెమో డిసౌజా దీనికి ద‌ర్శ‌కుడు. ఇక ఈ చిత్రం త‌ర్వాత సుల్తాన్, టైగ‌ర్ జిందా హై ఫేమ్ అలీ అబ్బాస్ జాఫ‌ర్ తో భరత్.. సాజిద్ తో కిక్-2 సినిమాలు కమిటయ్యాడు. మొత్తానికి స‌ల్మాన్ దూకుడు చూసి మిగిలిన హీరోలు ఇప్పుడు కుళ్లుకుంటున్నారు.  
 

More Related Stories