English   

సల్మాన్ ఖాన్ కు శతృవు ఫ్యామిలీయేనట

Race-3-trailer

బాలీవుడ్ యాక్షన్ సినిమాలకో స్పెషాలిటీ ఉంది. అక్కడ కాస్త కాన్ సెంట్రేట్ చేసి తీసిన అన్ని యాక్షన్ సినిమాలూ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. కొన్నాళ్ల క్రితం రేస్, రేస్-2 మూవీస్ అక్కడ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ రెండు సినిమాలూ కుటుంబాల మధ్య వచ్చే కలహాల నేపథ్యంలోనే ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య గొడవతో సాగే కథే రేస్. దీంతో ఈ రేస్ సిరీస్ కు క్రేజ్ పెరిగింది. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ ఇప్పుడు రేస్ -3 వస్తోంది. ఈ సారి సల్మాన్ ఖాన్ మెయిన్ హీరో. ఈ రేస్ లోకి సల్లూ భాయ్ ఎంటర్ కావడం ఇదే ఫస్ట్ టైమ్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఓ ఫుల్ ప్యాక్డ్ హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఏ మాత్రం తీసిపోనట్టుగా ఉంది.  

భారీ యాక్షన్ స్టంట్స్, కళ్లు చెదిరే చేజింగ్ సీన్స్, బ్లాస్టింగ్స్ తో దుమ్మురేపే యాక్షన్ సీక్వెన్స్.. ఇలా సాగుతుందీ రేస్ -3 ట్రైలర్. ట్రైలర్ ఆసాంతం.. యాక్షన్ తోనే నింపేశారు. మొదట్లో తన ఫ్యామిలీ అంటూ వెంపర్లాడినా.. తర్వాత తనకు వాళ్లే శతృవులు అని తెలుసుకుంటాడు సల్మాన్.. తర్వాతే అసలు యాక్షన్ మొదలవుతుందేమో అన్నట్టుగా ఉందీ ట్రైలర్. రెమో డి సౌజా డైరెక్ట్ చేసిన రేస్-3లో సల్మాన్ తో పాటు జాక్వలిన్ ఫెర్నాండెజ్, బాబీ డియోల్, డైసీ షా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నాడు. ట్రైలర్ తో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన రేస్ -3 జూన్ 15న విడుదల కాబోతోంది.  

More Related Stories