English   

ఆకట్టుకుంటున్న ఉదయించే సూర్యాడిలా సాంగ్..!

avam jagath
2021-09-15 19:25:38

దినేష్ నర్రా దర్శకత్వంలో మణి రత్నం నాయుడు, ఎం రాజేశ్వరి నిర్మిస్తున్న చిత్రం ఏవమ్ జగత్. ఈ సినిమాను మార్స్ మూవీ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో కిరణ్ గేయ, ప్రకృతి వనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని లవ్ సాంగ్  ని అనన్య నాగళ్ళ విడుదల చేసింది."ఉదయించే సూర్యుడిలా" అనే ఈ పాటకు శివకుమార్ మ్యూజిక్ అందించగా సందీప్ కూరపాటి సమీరా భరద్వాజ్ ఆలపించిన సాంగ్ ఇది. అనన్య నాగల్ల ఈ పాటను రిలీజ్ చేసే చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

 టెక్నాలజీ డెవలప్ అవడంతో ఎన్నో పరిశ్రమలు, అలాగే ఉద్యోగాలు పుట్టుకురావడంతో చాలా మంది ప్రజలు తమ సొంత ఊర్లో ని విడిచి రాష్ట్రాలకు దేశాలకు వలస వెళ్లి అతడు చిన్న పడ్డారు. దీంతో దేశం నిజంగానే అభివృద్ధి చెందిదా లేక మనం కలాం గారి కల,మిషన్ 2020 నెరవేరిందా! అన్న ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో దినేష్ మాట్లాడుతూ వ్యవసాయం భవిష్యత్తు ఏంటి? అలాగే రాబోయే తరానికి కావలసిన తిండి అవసరాలు తీర్చే అంత సాగు భూమి, అలాగే పండించగల సామర్థ్యం, అనుభవం మన దేశ యువతికి ఉందా అనే అంశాలను ప్రధానంగా ఈ సినిమాలో చూపించబోతున్నాం అని తెలిపారు. ఒక ఇరవై ఏళ్ల యువకుడు మానవసంబంధాల తో ముడిపడి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే కథే ఈ ఏవమ్ జగత్ అని తెలిపారు.

 ఇకపోతే ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా, స్కంద అముదాల, సంజయ్, భూపేష్ వడ్లమూడి, ఫయాజ్ అహ్మద్, దినకర్, స్వప్న గొల్లం, సరస్వతి కరవాడి, విజయలక్ష్మి తదితరులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం - శివ కుమార్, 
సినిమాటోగ్రఫీ            -వెంకీ అల్ల, 
ఎడిటింగ్                   - నిశాంత్ చిటుమోతు, 
ఆర్ట్                          - సదా వంశి, 
ప్రొడక్షన్ మేనేజర్        -అభినవ్  అవునూరి, 
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ -మోహన్ కృష్ణ, 
క్వాలిటీ హెడ్               - సిద్దార్థ కండల 
సంపూర్ణమ్మ, స్కంద ఆముదాల, 
నిర్మాతలు                       -ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్, 
రచన దర్శకత్వం                -దినేష్ నర్రా
పిఆర్ ఓ                              - సాయి సతీష్, పర్వతనేని

More Related Stories