English   

ఇటలీలో ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదుగా

Radhe Shyam
2020-10-29 17:43:58

బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. బాహుబలి సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలై రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా చైనా, రష్యా, ఇటలీ లో సైతం విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో "రాధే శ్యామ్" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. రాధే శ్యామ్ సినిమాకు "డియర్ కామ్రేడ్" సినిమాకు సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉండగా రాధే శ్యామ్ సినిమాను ఇటలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. దాంతో షూటింగ్ ను ఇటలీలో చిత్రిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. ఇటీవల కరోనా విజృంభన తగ్గడంతో షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. అయితే ఇటలీలో షూటింగ్ జరుపుతున్న రాధే శ్యామ్ సినిమాపై అక్కడి మీడియా ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దాంతో ప్రభాస్ క్రేజ్ గ్లోబల్ రేంజ్ లో సైతం పెరిగిపోయింది.

More Related Stories