English   

విక్రమాదిత్యగా ప్రభాస్.. అదిరిపోయిన రాధే శ్యామ్ ఫస్ట్ లుక్..

Radhe Shyam
2020-10-21 11:59:41

ప్రభాస్ అభిమానులు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న రోజు వచ్చింది. అక్టోబర్ 23న పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల ముందే రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే ఫస్ట్ లుక్ విడుదలైంది. ప్రేరణ అనే అమ్మాయిగా ఇందులో నటిస్తుంది పూజ. ఇప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ పేరు కూడా బయటకు వచ్చింది. ఈయన విక్రమాదిత్యగా నటిస్తున్నాడు. వింటేజ్ కార్ల పై స్టైల్ గా కూర్చున్న ప్రభాస్ పోస్టర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత ఫిదా అయిపోతున్నారు యంగ్ రెబల్ స్టార్ అభిమానులు. 

నిజానికి రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనపుడు కాస్త నిరుత్సాహపడ్డారు ఫ్యాన్స్. ప్రభాస్ మంచి కోరుకునే మాస్ అంశాలు ఈ సినిమాలో లేవు అంటూ వాళ్లు ఫీలయ్యారు. పూర్తిగా మ్యూజికల్ బ్యాగ్రౌండ్ లో వస్తున్న సినిమా అనుకొని కంగారు పడ్డారు.. కానీ ఇప్పుడు విడుదలైన పోస్టర్ చూస్తుంటే వాళ్ళకు నమ్మకం కలుగుతుంది.. ఈసారి కచ్చితంగా ప్రభాస్ మాయ చేస్తాడని. అయితే ఒక్కటి మాత్రం నిజం బాహుబలి, సాహో తరహాలో ఇది మాస్ సినిమా కాదు.. పూర్తిగా క్లాస్ సినిమా. ఇందులో లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నాడు ప్రభాస్. ఆయన ఇమేజ్ కు భిన్నంగా ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో యు.వి.క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల కానుంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రాధే శ్యామ్ విడుదల కానుంది. 

More Related Stories