English   

కమల్ హాసన్ కు విలన్ గా రాఘవ లారెన్స్

Raghava Lawrence
2021-03-08 17:00:43

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహారిస్తూ కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కమల్ "ఖైదీ, మాస్టర్" సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు "విక్రమ్" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ మరియు టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై భారీ అంచలున్నాయి. 

అయితే తాజాగా కోలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ కు విలన్ గా కొరియోగ్రాఫర్ లారెన్స్ నటించబోతునట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన లారెన్స్ ప్రస్తుతం దర్శకుడిగా, నటుడిగా కూడా అలరిస్తున్నాడు. అయితే కంచెన లాంటి డిఫరెంట్ సినిమాలో నటించినప్పటికీ విలన్ గా ఫుల్ లెన్త్ రోల్ ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారట. కనకరాజ్ ఇప్పటికే మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి లోని విలనిజాన్ని చూపించి ఆకట్టుకుకున్నారు. మరి లారెన్స్ లోని విలన్ ను కనకరాజ్ ఎలా చూసిపిస్తారో చూడాలి.

More Related Stories