English   

సంచలనం...మొదటి బాలీవుడ్ సినిమా నుండి బయటకొచ్చిన లారెన్స్

ragava1
2019-05-19 20:48:31

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్మీ బాంబ్’. తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయిన కాంచన సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరక్కుతోంది. ఈ సినిమా ద్వారా రాఘవ లారెన్స్ దర్శకుడిగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే నిన్న సినిమా ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే అనూహ్యంగా ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు దర్శకుడు రాఘవ లారెన్స్. నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్‌ తన ప్రమేయం లేకుండా రిలీజ్ చేశారని విడుదలైన విషయం కూడా మూడో వ్యక్తి చెప్పాక తెలిసిందని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశాడు.  ప్ర‌పంచంలో డ‌బ్బు, ఫేం ఎంత ఉన్నా ఓ మ‌నిషికి కావాల్సింది ఆత్మ గౌరవం అని అద్జే మ‌నిషికి చాలా ముఖ్యం అని అది లేని చోట ప‌నిచేయడం క‌ష్టం. అందుకే నేను కాంచ‌న రీమేక్ చిత్రం నుండి త‌ప్పుకుంటున్నానని ప్రకటించారు నేను ఈ ప్రాజెక్టు నుండి త‌ప్పుకోవ‌డానికి చాలా రీజ‌న్స్ ఉన్నాయి. కాని అవి ఇప్పుడు చెప్ప‌ద‌ల‌చుకోలేదు. అయితే అక్ష‌య్ కుమార్ మీద ఉన్న అభిమానం మేరకు చిత్ర స్క్రిప్ట్‌ని వారికి అందిస్తాను. వేరే డైరెక్ట‌ర్‌తో వారికి న‌చ్చిన విధంగా మూవీని  తెరకేక్కిస్తారని ప్రకటించారు.

More Related Stories