English   

మీడియాకు దర్శకేంద్రుడి వార్నింగ్. 

Raghavendra-Rao
2018-12-07 20:11:55

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావ్ కు కోపం వచ్చింది. ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా పొద్దున్నే ఆయ‌న ఫిల్మ్ న‌గ‌ర్ బూత్ కు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకోడానికి వ‌చ్చాడు. అయితే లైన్ లో కాకుండా నేరుగా లోనికి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తే.. అక్క‌డున్న ఓట‌ర్లు వారించారు. సెలెబ్రెటీస్ అయితే ఏంటి.. క్యూలోనే రావాలంటూ కోరారు. దాంతో అక్క‌డ అధికారులు కూడా రాఘ‌వేంద్ర‌రావ్ కు ఇదే చెప్ప‌డంతో ఆయ‌న నొచ్చుకుని అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఓటు వేయ‌కుండానే వెళ్లిపోయిన రాఘ‌వేంద్ర‌రావ్.. కోపంతో వెనుదిరిగిన ద‌ర్శ‌కేంద్రుడు అంటూ మీడియాలో వార్త‌లు వ‌చ్చేసాయి. అలిగి వెళ్లి ఓటు వేయలేదంటూ రాసుకొచ్చాయి. కానీ ఆయ‌న మాత్రం అక్క‌డ ర‌ష్ కాస్త త‌గ్గిన త‌ర్వాత మ‌ళ్లీ వ‌స్తాన‌ని అక్క‌డ చెప్పేసి వెళ్లార‌ని తెలుస్తుంది. అన్న‌ట్లుగానే రెండు మూడు గంట‌ల త‌ర్వాత మ‌ళ్లీ వ‌చ్చి త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నాడు ద‌ర్శ‌కేంద్రుడు. త‌ర్వాత ఇదే సెల్ఫీ పెట్టి త‌ను ఎక్క‌డికి వెళ్ల‌లేద‌ని.. త‌ను బాధ్య‌త గ‌ల వ్య‌క్తిని అని అందుకే వ‌చ్చి ఓటు వేసాన‌ని చెప్పాడు. మీడియా వాళ్లు అన‌వ‌స‌రంగా నిజానిజాలు తెలుసుకోకుండా రాయకూడ‌ద‌ని చెప్పాడు ద‌ర్శ‌కేంద్రుడు. త‌న విష‌యంలో మీడియా తీరుతో ఆయ‌న బాగానే నొచ్చుకున్నారు

More Related Stories