English   

శేష్ , రాహుల్ .. రఫ్పాడించారబ్బా.. 

Adivi-Sesh
2018-08-05 13:08:14

వాళ్లు నటులుగా ప్రూవ్ చేసుకున్నారు. కానీ వారిలో అంతకు మించిన టాలెంట్ ఉంది. బట్ అదేమీ క్యాజువల్ టాలెంట్ కాదు.. లేటెస్ట్ గా వీరి ప్రతిభ చూసిన ప్రతి ఒక్కరూ బ్రిలియంట్ అంటున్నారు. ఆ స్థాయిలో సరికొత్త రూట్ లోనూ సక్సస్ ఫుల్ గా దూసుకుపోతోన్న ఆ యంగ్ స్టర్స్ వేరెవరో కాదు.. అడవి శేష్, రాహుల్ రవీంద్రన్.. యాక్టర్స్ గా ఎట్రాక్ట్ చేసిన వీళ్లు డైరెక్టర్స్ గా అంతకంటే రైటర్స్ గా మెస్మరైజ్ చేస్తున్నారు..?

అడవి శేష్.. మనకు పెద్దగా తెలియక ముందే కర్మ అనే సినిమా చేశాడు. ఆ కర్మ స్క్రిప్ట్ కు చాలామంది ఫిదా అయ్యారు. తర్వాత మెల్లగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేశాడు. బట్ క్షణం తర్వాత అతని స్థాయి ఏంటనేది ప్రేక్షకులకు తెలిసింది. ఓ నటుడుగా ఎంత ఆకట్టుకున్నాడో.. రైటర్ గా అంతకు మించి అన్నట్టుగా ప్రూవ్ చేసుకున్నాడు. అడవి శేష్ బేసికల్ గా మంచి రైటర్. స్క్రీన్ ప్లేలోనూ ఎక్స్ పర్ట్. తనే రాస్తాడు.. కాబట్టి తన పాత్రకు సంబంధించిన బిల్డప్స్ ఉండవు. కథను మాత్రమే సెంటర్ పాయింట్ గా చేసుకుని అందుకు తగ్గ పాత్రలే క్రియేట్ చేస్తాడు. లేటెస్ట్ గా వచ్చిన గూఢచారి చూస్తే అతనిలోని రచయితకు ఫిదా కాకుండా ఉంటామా. ఇలాంటి కథ విజువల్ గా ప్రెజెంట్ చేయడం కంటే రైటప్ చాలా కష్టం. ఆ కష్టాన్ని ఈజీగా ఓవర్ టేక్ చేశాడు కాబట్టే గూఢచారి జెన్యూన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 
 
ఇక అందాల రాక్షసితో ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్.. తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ అతను ఇండస్ట్రీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చాడు. కాకపోతే కోలీవుడ్ లో. అనుకోకుండా టాలీవుడ్ లో హీరో అయ్యాడు. బట్ తన ప్యాషన్ ను మాత్రం వదులుకోలేదు. కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా చిలసౌ సినిమాతో దర్శకుడుగా వచ్చాడు. ఈ సినిమా సుశాంత్ ఫస్ట్ హిట్ గా నిలిచింది. అయితే రాహుల్ లోని సెన్సిబుల్ రైటర్ ను ఈ మూవీ బయటపెట్టింది. కొన్ని సీన్స్ లో అతని రైటప్ బ్రిలియంట్ అనిపిస్తుంది. మొత్తంగా ఇండస్ట్రీలో ఇలాంటి టాలెంట్ రేర్ అనే చెప్పాలి. యాక్టర్, రైటర్ అండ్ డైరెక్టర్ గా ట్రిపుల్ రోల్ ప్లే చేస్తూ కూడా సూపర్ హిట్ అవుతోన్న ఇలాంటి మల్టీ టాలెంట్ మరింత పెరిగితే మనకు మరిన్ని బెస్ట్ మూవీస్ వస్తాయనడంలో డౌటే లేదు. 

More Related Stories