English   

నాగార్జునకి దణ్ణంరా బాబు అంటున్న మన్మధుడు డైరెక్టర్

nag
2019-04-18 21:54:20

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పుడు తనకు గతంలో బంపర్ హిట్ అయిన మన్మధుడు సినిమా సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ‘చి.ల.సౌ’తో డైరెక్టర్‌గా మంచి సక్సెస్‌ అందుకున్న నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ మన్మథుడు2ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌ లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటొంది. అయితే నాగ్ ఫ్యాన్స్ కోసమే అంటూ నాగ్‌కు సంబంధించిన ఓ షాట్‌ను రాహుల్‌ రవీంద్రన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తన ట్విటర్‌లో నాగ్‌ ఫోటోను షేర్‌ చేస్తూ ఫిట్‌నెస్‌లో ఈ మనిషికి ఒక దండం అంటూ కింగ్‌ ఫ్యాన్స్‌ ఈ ఒక్క సీన్‌ మాత్రం మీకోసమే అని ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఒక క్యామియోలో సమంత కూడా నటిస్తోంది. 

More Related Stories