English   

రాహుల్ ఎమోషనల్ పోస్ట్..పునర్నవి హ్యాండ్ ఇచ్చిందా

Rahul sipligunj
2020-10-30 12:10:50

టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం యూట్యూబ్ పాపులర్ ఉద్భవ్ తో ఎంగేజ్మెంట్ అయిందంటూ ఓ ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఉద్భవ్ యూట్యూబ్ వీడియోస్ తో పాపులర్ అయ్యాడు. అంతే కాకుండా స్క్రిప్ట్ రైటర్ గా కూడా పనిచేస్తున్నాడు. పునర్నవి సోషల్ మీడియాలో ఉద్భవ్ ఫోటోను బ్లర్ చేసి పోస్ట్ చేయగా...ఉద్భవ్ ఏకంగా పునర్నవి ఫోటోను అప్లోడ్ చేసి పునర్నవి ఒకే చెప్పిందంటూ పేర్కొన్నాడు. ఇక ఇదిలా ఉండగా పునర్నవి భూపాలం బిగ్ బాస్ సీజన్3 లో సింగర్ రాహుల్ సిప్లింగజ్ తో ప్రేమాయణం నడిపించిన సంగతి తెలిసిందే. హౌస్ లో వాళ్ళు చేసిన రొమాన్స్ కి భయట ఆడియన్స్ ఫిదా అయ్యారు. రాహుల్ గెలుపుకు కూడా పున్నూ యే కారణమంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక హౌస్ లో నుండి భయటకు వచ్చిన తరువాత కూడా ఈ జంట టీవీ షోస్ లో సందడి చేశారు. అయితే తాజాగా పునర్నవి ఎంగేజ్మెంట్ అయిందంటూ ఫోటోలు పెట్టడంతో నెటిజన్లు రాహుల్ ను టాగ్ చేస్తూ పునర్నవి హాండ్ ఇచ్చిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. దాంతో రాహుల్ "నా విశ్వాసంతో నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. నా కలకలను నేను పెళ్లి చేసుకున్నాను" అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. అంతే కాకుండా ఎవరో ఎంగేజ్మెంట్ చేసుకుంటే మనకేం సంబంధం మీరు నన్ను ఎందుకు ట్యాగ్ చేశారు. అని వ్యాఖ్యానించారు. దాంతో రాహుల్ ని పున్నూ మోసం చేసిందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

More Related Stories