English   

పంచతంత్రం నుండి రాహుల్ విజయ్  ఫస్ట్ లుక్ 

Rahul Vijay
2021-06-07 17:41:19

హీరో రాహుల్ విజయ్  పుట్టినరోజు సందర్భంగా ‘పంచతంత్రం’ సినిమాలో అతని ఫస్ట్ లుక్‌‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో సుభాష్ అనే పాత్రలో రాహుల్ విజయ్ నటిస్తున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్‌లో తెలిపారు. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. 

ఈ సందర్భంగా దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ.. ‘‘పెళ్లి, కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే విషయాల్లో కచ్చితమైన భావాలు ఉన్న 28 సంవత్సరాల యువకుడు సుభాష్ పాత్రలో రాహుల్ విజయ్ కనిపిస్తారు. ఈతరం యువతకు పెళ్లి, జీవితాంతం కొనసాగే బంధాలు, బాధ్యతలు వంటి విషయాల్లో ఉండే కన్‌ఫ్యూజన్‌ను, క్లారిటీని చూపించే పాత్ర. సింపుల్ అండ్ రొమాంటిక్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు’’ అని తెలుపగా.. నిర్మాతలు సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. ‘‘రాహుల్ విజయ్‌కు మా ‘పంచతంత్రం’ చిత్రబృందం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. సుభాష్ పాత్రలో అతను కనిపిస్తాడు. అతడిలో ఇప్పటి యువత తమను తాము చూసుకుంటారు. నేటి యువతరానికి ప్రతినిధి లాంటి సుభాష్ పాత్రలో రాహుల్ విజయ్ సహజంగా నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్స్‌కు సూపర్ రెస్పాన్స్ లభించింది. జూలైలో లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. అటు ఇటుగా పది రోజులు షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అవుతుంది. లాక్‌డౌన్‌లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించాం’’ అని అన్నారు.

More Related Stories