English   

సెల్యూలాయిడ్ మాస్ట‌ర్.. రాజ్ కుమార్ హిరాణి..!

Raj-Kumar-Hirani
2018-06-30 14:57:02

రాజ్ కుమార్ హిరాణీ.. ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్స్ లో ఈయ‌న కూడా ఒక‌రు. అనుభ‌వం 15 ఏళ్లు.. కానీ చేసింది 5 సినిమాలే. కానీ అన్నీ చ‌రిత్ర సృష్టించిన సినిమాలే. ఈయ‌న సినిమా వ‌స్తుందంటే హిట్ త‌ప్ప‌నిస‌రి అని క‌న్ఫ‌ర్మ్ అయిపోయారు ప్రేక్ష‌కులు. ఇప్పుడు ఈయ‌న నుంచి వ‌చ్చిన సినిమా సంజూ. సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ గా వ‌చ్చిన ఈ చిత్రం కూడా అద్భుత‌మైన టాక్ సొంతం చేసుకుంది. పైగా స్నేహితుడి బ‌యోపిక్ కావ‌డంతో మ‌రింత అందంగా మ‌లిచాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాతో రాజ్ కుమార్ హిరాణి ఎంత‌టి గొప్ప ద‌ర్శ‌కుడో మ‌రోసారి అర్థ‌మైపోయింది అంద‌రికీ. లేక పోతే మ‌రేంటి.. అంత‌టి నెగిటివ్ ఇమేజ్ మోస్తున్న వ్య‌క్తిని కూడా సినిమా అయిపోయేస‌రికి అయ్యో పాపం అని ప్రేక్ష‌కుల‌తో అనిపించాడు. అలాంటి మాయావి ఈ ద‌ర్శ‌కుడు. సెల్యూలాయిడ్ పై ఎలాంటి మంత్రాలు వేస్తే ఎలా క‌లెక్ష‌న్లు రాలుతాయి అని లెక్క‌లేయ‌డంలో రాజ్ కుమార్ హిరాణిని మించిన వాళ్లే లేరు. అందుకే 15 ఏళ్లుగా ఆయ‌న్ని ద‌రిచేరాలంటే ఓట‌మి వ‌ణికిపోతుంది. ప‌డే క‌ష్టం అలా ఉంటుంది.. ఈ రోజుల్లో ద‌ర్శ‌కుడు ఒక్క నెల‌లో క‌థ రాసుకుని.. షూటింగ్ కు వెళ్లిన త‌ర్వాత అప్ప‌టిక‌ప్పుడు డైలాగులు రాస్తుంటారు.. సీన్స్ మారుస్తుంటారు. కానీ హిరాణీ స్కూల్ అది కాదు. ఒక్క‌సారి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందంటే.. సినిమా కూడా 90 శాతం పూర్తైపోయిన‌ట్లు. ఇక 10 శాతం షూటింగ్ అన్న‌మాట‌. ఉన్న‌ది ఉన్న‌ట్లు అలా తీస్తూ పోతుంటాడు. అందుకే మున్నాభాయ్ ఎంబిబిఎస్.. ల‌గేర‌హో మున్నాభాయ్.. 3 ఇడియ‌ట్స్.. పీకే.. ఇప్పుడు సంజూ లాంటి అద్బుతాలు ఈయ‌న నుంచి వ‌చ్చాయి. ఇలాగే ఇంకా వ‌స్తుంటాయి. ఇలాంటి ద‌ర్శ‌క దిగ్గ‌జాలు మ‌న తెలుగులో కూడా ఉండుంటే ఎంత బాగున్నో క‌దా..!

More Related Stories