English   

ప్రేమ‌లో ప‌డిన రాజ్ త‌రుణ్..

raj tarun
2018-02-28 11:59:08

ఇన్నాళ్లైంది ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. క‌చ్చితంగా ప్రేమ‌లో ప‌డే ఉంటాడు.. ఇంత‌కీ ఎవ‌రా అమ్మాయి..? రాజ్ త‌రుణ్ మ‌న‌సు దోచిన బ్యూటీ ఎవ‌రనే ఊహ‌ల్లోకి వెళ్లిపోయారా..? ఆ ఊహ‌ల‌కు అక్క‌డితోనే బ్రేక్ వేయండి. రాజ్ త‌రుణ్ ప్రేమ‌లో ప‌డిన మాట వాస్త‌వ‌మే.. కానీ ఆయ‌న ల‌వ‌ర్ గా మారింది మాత్రం సినిమా కోస‌మే.. రియ‌ల్ లైఫ్ లో కాదు. ఎక్కుపెట్టిన బాణంలా వ‌ర‌స విజ‌యాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కుర్రాడు రాజ్ త‌రుణ్. ఉద‌య్ కిర‌ణ్ త‌ర్వాత ఆ స్థాయిలో హ్యాట్రిక్ విజ‌యాల‌తో రెచ్చిపోయాడు ఈ కుర్రాడు. కానీ ఆ త‌ర్వాత వ‌ర‌స‌గా రెండు ఫ్లాపుల‌తో కింద‌ప‌డ్డాడు. ఈ మ‌ధ్యే కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌తో ప‌ర్లేదనిపించిన రాజ్ త‌రుణ్‌.. అంధ‌గాడుతో మ‌ళ్లీ గాడిత‌ప్పాడు. అయినా వ‌ర‌స‌గా సినిమాలు మాత్రం చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ప్ర‌స్తుతం సంజ‌నా రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రాజుగాడు సినిమాలో న‌టిస్తున్నాడు రాజ్ త‌రుణ్. ఇక మొన్న సంక్రాంతికి వ‌చ్చిన రంగులరాట్నం ఎటూ 
కాకుండా పోయింది.

కెరీర్ దారుణ‌మైన స్టేజ్ లో ఉన్న‌పుడు గోల్డెన్ హ్యాండ్ దిల్ రాజు నుంచి మ‌నోడికి ఆఫ‌ర్ వ‌చ్చింది. ఇప్ప‌టికే సినిమా ఓపెనింగ్ జ‌రిగి కూడా నాలుగు నెల‌లు దాటేసింది. అలా ఎలా ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం చేస్తున్నాడు రాజ్ త‌రుణ్. ల‌వ‌ర్ అనే టైటిల్ తో ఈ చిత్రం వ‌స్తుంది. శ‌త‌మానం భ‌వ‌తి సినిమానే రాజ్ త‌రుణ్ తో చేయాల్సింది కానీ అనుకోని కార‌ణాల‌తో ఈ సినిమా శ‌ర్వానంద్ కు వెళ్లిపోయింది. అలా మిస్సైన ఛాన్స్ ఇప్పుడు అనీష్ కృష్ణ సినిమా రూపంలో ద‌క్కించుకున్నాడు రాజ్ త‌రుణ్. ఈ సినిమాలో రిద్ది కుమార్ హీరోయిన్ గా న‌టిస్తుంది. జూన్ 14న సినిమా విడుద‌ల కానున్న‌ట్లు అనౌన్స్ చేసాడు నిర్మాత దిల్ రాజు. మొత్తానికి బ్యాడ్ టైమ్ లో బంప‌ర్ ఆఫ‌ర్ లా దిల్ రాజు సినిమా ప‌ట్టేసాడు ఈ కుర్ర హీరో. మ‌రి ఈ ల‌వ‌ర్ రాజ్ త‌రుణ్ కెరీర్ కు ఎంత వ‌ర‌కు బ్రేక్ ఇస్తుందో చూడాలి..!

More Related Stories