English   

అప్పుడు సునీల్.. ఇప్పుడు రాజ్ త‌రుణ్..!

Raj-Tarun
2018-07-21 16:07:34

సాధార‌ణంగా దిల్ రాజు లెక్క అంత ఈజీగా త‌ప్ప‌దు. కానీ అప్పుడేదో మాయ‌లో సునీల్ విష‌యంలో మోస‌పోయాడు ఈ నిర్మాత‌. త‌న ద‌గ్గ‌రే ఎన్నో ఏళ్లుగా ప‌ని చేస్తున్న వాసువ‌ర్మ చెప్పిన క‌థ న‌చ్చి.. న‌మ్మి కృష్ణాష్ట‌మి నిర్మించాడు రాజు. ఈ చిత్రం క‌నీసం రెండు రోజులు కూడా ఆడ‌లేదు. దిల్ రాజు కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్ట‌ర్ గా నిలిచిపోయింది ఈ చిత్రం. అయితే ఈ చిత్రం త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ఈయ‌న‌కు ఫ్లాప్ లేదు. క‌థ ద‌గ్గ‌ర చాలా ప‌క్కాగా ప్లాన్ చేసుకుంటూ వ‌స్తున్నాడు దిల్ రాజు. కానీ రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ రాజ్ త‌రుణ్ విష‌యంలోనే మోస‌పోతున్నాడు దిల్ రాజు. ఈ హీరోతో ల‌వ‌ర్ సినిమా నిర్మించాడిప్పుడు. అయితే ముందు నుంచీ ఈ చిత్రంపై ఎందుకో కానీ దిల్ రాజు త‌క్కువ న‌మ్మ‌కంతోనే ఉన్నాడు. ప్ర‌తీ ప్రెస్ మీట్ లో కూడా ఈ చిత్రాన్ని హ‌ర్షిత్ త‌న ఇష్టంతో నిర్మించాడు.. క‌థ పూర్తిగా త‌న‌దే.. తాను కొన్ని మార్పులు చెప్పినా కూడా ఇద్ద‌రి టేస్ట్ లు ఒక‌లా ఉండ‌వు క‌దా అన్న‌ట్లు హింటిచ్చాడు. ఇప్పుడు రాజుగారు అన్న‌దే నిజ‌మైంది. ల‌వ‌ర్ మ‌రో రొటీన్ సినిమాగా మిగిలిపోయింది. అనీష్ కృష్ణ రెండో ప్ర‌య‌త్నంలో ఆక‌ట్టుకోలేదు. మ‌రీ ముఖ్యంగా క్లైమాక్స్ లో కార్ హ్యాకింగ్ కాన్సెప్ట్ అయితే వీడియో గేమ్ లా ఉందంటూ న‌వ్వుతున్నారు ప్రేక్ష‌కులు. ఏదేమైనా ల‌వ‌ర్ తో రాజుగారి రెండేళ్ల జైత్ర‌యాత్ర‌కు బ్రేకులు ప‌డుతున్న‌ట్లే అనిపిస్తుంది. 

More Related Stories