English   

ఈ వారం డిజాస్ట‌రాయ‌న‌మః

Raj Tarun Lover Aatagadhara Siva Manchu Lakshmi W/o Ram

మ‌నం నాలుగు రాళ్లు వేస్తాం.. క‌నీసం ఏదో ఒక్క‌టైనా త‌గ‌ల‌క‌పోదా..? క‌చ్చితంగా ఒక్క‌టైనా త‌గులుతుంద‌నే ఆశ వాళ్ల‌లోనూ ఉంటుంది. కానీ ఈ వారం అది కూడా జ‌ర‌గ‌లేదు. అయితే ఇక్క‌డ వేసింది రాళ్లు కాదు.. సినిమాలు. ఈ వారం నాలుగు సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఒక్క‌టి కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క్లిక్ కాలేదు. అన్నీ ఒక‌దాన్ని మించి మ‌రో డిజాస్ట‌ర్ అయి కూర్చున్నాయి. దిల్ రాజు బ్యాన‌ర్ లో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన రాజ్ త‌రుణ్ ల‌వ‌ర్ కు తొలిరోజే ఫ్లాప్ టాక్ వ‌చ్చింది. దాంతో రెండేళ్ల త‌ర్వాత ఫ్లాప్ అంటే ఎలా ఉంటుందో మ‌ళ్లీ చూసాడు రాజు. ఈ చిత్రం మూడు రోజుల్లో క‌నీసం 2 కోట్లు కూడా తీసుకురాలేదు.

ఇక ఇదే వారం వ‌చ్చిన మ‌రో సినిమా ఆట‌గ‌ద‌రా శివ‌. చంద్ర‌సిద్ధార్థ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నా ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్ కు ర‌ప్పించ‌డంలో విఫ‌ల‌మైంది. మంచు ల‌క్ష్మి వైఫ్ ఆఫ్ రామ్ కూడా అంతే. దీనికి కూడా టాక్ బాగానే వ‌చ్చినా ప్రేక్ష‌కులు మాత్రం రాలేదు. ఇక ప‌రిచ‌యం అనే సినిమా గురించి చెప్పాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఈ వారం వ‌చ్చిన సినిమాల‌న్నీ చాప చుట్టేయ‌డంతో గ‌త వారం నుంచి దుమ్ము లేపేస్తోన్న ఆర్ఎక్స్ 100 ఈ వారం కూడా బాక్సాఫీస్ ను ద‌త్త‌త తీసుకుంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే 11 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. పెట్టుబ‌డికి ఇప్ప‌టికే నాలుగు రెట్లు తీసుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ కా డ‌బుల్ బాప్ అయిపోయింది. ఈ వారం ఎలాగూ మూస‌గా ముగియ‌డంతో వ‌చ్చే వారం సాక్ష్యం.. హ్యాపీవెడ్డింగ్ పైనే ఆశ‌లు ఉన్నాయి.

More Related Stories