English   

ప్రేమ‌లో రాజ్ త‌రుణ్.. ఒడ్డున ప‌డ‌తాడా..?

raj-tarun
2018-06-18 09:19:41

ఇన్నాళ్లైంది ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. క‌చ్చితంగా ప్రేమ‌లో ప‌డే ఉంటాడు.. ఇంత‌కీ ఎవ‌రా అమ్మాయి..? రాజ్ త‌రుణ్ మ‌న‌సు దోచిన బ్యూటీ ఎవ‌రనే ఊహ‌ల్లోకి వెళ్లిపోయారా..? ఆ ఊహ‌ల‌కు అక్క‌డితోనే బ్రేక్ వేయండి. రాజ్ త‌రుణ్ ప్రేమ‌లో ప‌డిన మాట వాస్త‌వ‌మే.. కానీ ఆయ‌న ల‌వ‌ర్ గా మారింది మాత్రం సినిమా కోస‌మే.. రియ‌ల్ లైఫ్ లో కాదు. ఎక్కుపెట్టిన బాణంలా వ‌ర‌స విజ‌యాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కుర్రాడు రాజ్ త‌రుణ్. ఉద‌య్ కిర‌ణ్ త‌ర్వాత ఆ స్థాయిలో హ్యాట్రిక్ విజ‌యాల‌తో రెచ్చిపోయాడు ఈ కుర్రాడు. కానీ ఆ త‌ర్వాత వ‌ర‌స‌గా రెండు ఫ్లాపుల‌తో కింద‌ప‌డ్డాడు. ఈ మ‌ధ్యే కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌తో ప‌ర్లేదనిపించిన రాజ్ త‌రుణ్‌.. అంధ‌గాడుతో మ‌ళ్లీ గాడిత‌ప్పాడు. ఈ మ‌ధ్య వ‌ర‌స‌గా రంగుల రాట్నం.. రాజుగాడుతో రెండు డిజాస్ట‌ర్లు ఇచ్చాడు ఈ కుర్ర హీరో. ఇదిలా ఉండ‌గానే దిల్ రాజు బ్యాన‌ర్ లో ల‌వ‌ర్ సినిమాకు క‌మిట‌య్యాడు. అలా ఎలా ఫేమ్ అనీష్ కృష్ణ దీనికి ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ప్లస్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌య్యాయి. పోనీ టైల్ తో కొత్త‌గా ఉన్నాడు రాజ్ త‌రుణ్. నిజానికి రెండేళ్ల కింద శ‌త‌మానం భ‌వ‌తి సినిమానే రాజ్ త‌రుణ్ తో చేయాల్సింది కానీ అనుకోని కార‌ణాల‌తో ఈ సినిమా శ‌ర్వానంద్ కు వెళ్లిపోయింది. అలా మిస్సైన ఛాన్స్ ఇప్పుడు అనీష్ కృష్ణ సినిమా రూపంలో ద‌క్కించుకున్నాడు రాజ్ త‌రుణ్. మొత్తానికి బ్యాడ్ టైమ్ లో బంప‌ర్ ఆఫ‌ర్ లా దిల్ రాజు సినిమా ప‌ట్టేసాడు ఈ కుర్ర హీరో. మ‌రి ఈ ల‌వ‌ర్ రాజ్ త‌రుణ్ కెరీర్ కు ఎంత వ‌ర‌కు బ్రేక్ ఇస్తుందో చూడాలి..!

More Related Stories