English   

ల‌వ‌ర్ టాక్.. దిల్ రాజు ఖుషీ..!

Raj-Tarun
2018-07-20 11:23:56

దిల్ రాజు సినిమా అంటే క‌చ్చితంగా మ‌రో ఆలోచ‌న లేకుండా హిట్ అని ఫిక్స్ అయిపోతున్నారు ప్రేక్ష‌కులు. ఇలాంటి టైమ్ లో ఈయ‌న రాజ్ త‌రుణ్ హీరోగా సినిమా చేయ‌డం మాత్రం అంద‌రికీ ఆశ్చ‌ర్య‌మే. ఎందుకంటే ఇప్పుడు మ‌నోడి మార్కెట్ తో పాటు సినిమాలు కూడా వ‌ర‌స‌గా పోతున్నాయి. ఇలాంటి టైమ్ లో రాజ్ త‌రుణ్ సినిమా అంటే రిస్క్ అని ఆయ‌నే ఒప్పుకున్నాడు. కానీ రాజుగారి చేయి ప‌డితే ఎవ‌రైనా మారిపోవాల్సిందే. రాజ్ త‌రుణ్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ల‌వ‌ర్ సినిమా ఫ‌స్ట్ టాక్ బ‌య‌టికి వ‌చ్చింది. ఈ చిత్రం బాగుంద‌ని.. ఫ‌స్టాఫ్ కాస్త యావ‌రేజ్ గా ఉన్నా.. సెకండాఫ్ మాత్రం ద‌ర్శ‌కుడు చాలా రేసీగా తీసుకెళ్లాడ‌ని చెబుతున్నారు ప్రేక్ష‌కులు. ఓవ‌ర్సీస్ నుంచి చాలా మంచి టాక్ వ‌చ్చింది ఈ చిత్రానికి. పైగా రాజ్ త‌రుణ్ ఇప్పుడున్న సిచ్యువేష‌న్ కు ఇలాంటి సినిమా ప‌డ‌టం ఆయ‌న అదృష్టం అంటున్నారు ప్రేక్ష‌కులు. కాస్త పబ్లిసిటీ చేసుకుంటే ఈ చిత్రంతో రాజ్ త‌రుణ్ మ‌ళ్లీ సేఫ్ జోన్ కు వ‌చ్చిన‌ట్లే. దిల్ రాజు కూడా త‌న స‌క్సెస్ స్ట్రీక్ ఇంకా కొన‌సాగించిన‌ట్లే. మొత్తానికి రాజుగారి చేయి ప‌డిన త‌ర్వాత రాయి కూడా బంగారం కావ‌డం అంటే ఇదేమ‌రి. 

More Related Stories