English   

రాజ్ తరుణ్  రాజుగాడు వచ్చేస్తున్నాడు

Raj-Tarun
2018-05-24 20:55:27

వరుస హిట్స్ తో టాలీవుడ్ లో సెన్షేషనల్  ఎంట్రీ ఇచ్చిన కుర్రాడు రాజ్ తరుణ్. కుర్రాడిలోని ఈజ్ చాలామందికి నచ్చేసింది. అందుకే కంటిన్యూస్ గా మూవీస్ కూడా చేశాడు. కానీ ప్రస్తుతం ఓ మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ హిట్ రాజుగాడు తెస్తాడనే నమ్మకంతో ఉన్నాడు రాజ్ తరుణ్. రాజుగాడు జూన్ 1న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. సంజనా రెడ్డి అనే కొత్తమ్మాయి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.  అయితే జూన్ 1న గట్టి పోటీ ఉంది. అయినా ఎంటర్టైనింగ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా రాజుగాడు ఆ పోటీలో గెలుస్తాడనే నమ్మకంతో ఉంది టీమ్. ఇక సినిమాలో రాజ్ తరుణ్ తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఆల్రెడీ ఈ ఇద్దరూ ఈడోరకం ఆడోరకం సినిమాలో కలిసి నటించారు. రాజ్ తరుణ్ జూనియర్ అయినా రాజేంద్ర ప్రసాద్ తో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. అది మరోసారి ఈ సినిమాలో రిపీట్ అవుతుందంటున్నారు. ఇక తనకు తెలియకుండానే వస్తువులు కొట్టేసే అరుదైన వ్యాధి ఉన్న కుర్రాడిగా రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఇలాంటి కథ మనం చూడలేదు. అందుకే ఇది ఫ్రెష్ గా అనిపిస్తుందంటున్నారు. సో ఈ మొత్తం కామెడీ వర్కవుట్ అయితే ఖచ్చితంగా ఈ సమ్మర్ కు ఫన్నీ ఎండింగ్ రాజుగాడు ఇస్తాడనుకోవచ్చు. 

More Related Stories