English   

రాజుగాడు ఉగాదికి వ‌స్తాడంట‌..

Raj-Tarun
2018-03-16 16:37:16

కాలం క‌లిసిరాక‌పోతే తాడే పామై కాటేస్తుందంటారు. ఇప్పుడు రాజ్ త‌రుణ్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో మ‌నోడి టైమ్ గిర్రున తిరిగింది. ఏకంగా మూడు వ‌ర‌స విజ‌యాలు అందుకున్నాడు. దాంతో రాజ్ త‌రుణ్ కు కొన్నేళ్ల పాటు తిరుగుండ‌దు అనుకున్నారంతా. కానీ తిరిగిన టైమ్ తిర‌గ‌బ‌డ‌టానికి కూడా ఎంతో టైమ్ ప‌ట్ట‌లేదు. వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకున్న చోటే ఇప్పుడు వ‌ర‌స‌గా ప‌రాజ‌యాలు అందు కుంటూ ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. రంగుల రాట్నం కూడా ఈ కుర్రాడి క‌ల‌ల్ని నెర‌వేర్చ‌లేదు. ప్ర‌స్తుతం సంజ‌నరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రాజుగాడు సినిమాలో న‌టిస్తున్నాడు రాజ్ త‌రుణ్. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. అమైరాద‌స్తూర్ ఇందులో హీరోయిన్. ఈ చిత్ర టీజ‌ర్ ఉగాదికి ప్రేక్ష కుల ముందుకు రానుంది. 

రాజుగాడుపైనే రాజ్ త‌రుణ్ ఆశ‌ల‌న్నీ ఉన్నాయి. ఇదిలా ఉండ‌గానే మ‌రో సినిమాకు క‌మిట‌య్యాడు ఈ హీరో. దిల్ రాజు బ్యాన‌ర్ లో అలా ఎలా ఫేమ్ అనీల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం చేస్తున్నాడు రాజ్ త‌రుణ్. ల‌వ‌ర్ అనే టైటిల్ తో ఈ చిత్రం వ‌స్తుంది. శ‌త‌మానం భ‌వ‌తి సినిమానే రాజ్ త‌రుణ్ తో చేయాల్సింది కానీ అనుకోని కార‌ణాల‌తో ఈ సినిమా శ‌ర్వానంద్ కు వెళ్లిపోయింది. అలా మిస్సైన ఛాన్స్ ఇప్పుడు అనీల్ కృష్ణ సినిమా రూపంలో ద‌క్కించుకున్నాడు రాజ్ త‌రుణ్. మొత్తానికి బ్యాడ్ టైమ్ లో బంప‌ర్ ఆఫ‌ర్ లా దిల్ రాజు సినిమా ప‌ట్టేసాడు ఈ కుర్ర హీరో. మ‌రి ఈ ల‌వ‌ర్ రాజ్ త‌రుణ్ కెరీర్ కు ఎంత వ‌ర‌కు బ్రేక్ ఇస్తుందో చూడాలి..!

More Related Stories