English   

రాజ్ తరుణ్ కు ఇది లాస్ట్ ఛాన్సా..?

raj tharun
2018-07-18 22:28:19

ఉయ్యాలా జంపాలాతో వచ్చిన రాజ్ తరుణ్ కెరీర్ కూడా ఉయ్యాలా జంపాలా ఆడుతోంది. కాకపోతే ఒకసారి ముందుకు వెళితే నాలుగైదు సినిమాలు వెనక్కి వెళుతోంది. అందుకే ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ కుర్రాడు తర్వాత తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అనుకునేలోపే రాంగ్ స్క్రిప్ట్స్ వేశాడు. వరుసగా చేసిన సినిమాలన్నీ పోతున్నాయి. ఇప్పటికే వరుసగా మూణ్నాలుగు పోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తోన్న లవర్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ నెల 20న విడుదల కాబోతోన్న లవర్ రాజ్ తరుణ్ కెరీర్ ను డిసైడ్ చేసే సినిమా అని ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటున్నారు.

దిల్ రాజు బ్యానర్ లో ఆయన కాకుండా అతని సోదరుడి కొడుకు హర్షిత్ తొలిసారిగా నిర్మించిన సినిమా ఇది. దిల్ రాజు వెనకే ఉండి అన్నీ చూసుకుంటున్నాడు. కానీ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. అది దిల్ రాజు ఖాతాలోకే వెళుతుంది. హిట్ అయితే రాజ్ తరుణ్ కెరీర్ నిలబడుతుంది. లేదంటే మళ్లీ స్ట్రగుల్స్ తప్పవు. ఏమాటకామాటే.. రాజ్ తరుణ్ కెరీర్ ఇబ్బంది పడడటానికి అతని యాటిట్యూడే కారణం అనేవాళ్లూ ఉన్నారు. హిట్స్ ఉన్నప్పుడు మనోడు చేసిన చాలా విషయాలు ఇప్పటికీ చాలామంది చెప్పుకుంటున్నారు. 

ఇక లేటెస్ట్ గా దిల్ రాజు ప్రెస్ మీట్ లో అతని రేంజ్ గురించి మాట్లాడుతుంటే రాజ్ తరుణ్ ఫేస్ బ్లాంక్ గా మారిపోయింది. ఒక రకంగా దిల్ రాజు అతని రేంజ్ గురించి చెప్పడం అంటే అతని కెరీర్ ను డిసైడ్ చేయడం లాంటిదే. మరి ఇండస్ట్రీలో ఇలాంటి అవమానాలు కామనే.. ఒక హిట్ పడితే అంతా సెట్ అవుతుంది. అప్పుడైనా బిహేవియర్ కరెక్ట్ గా ఉంచుకుంటే ఫ్యూచర్ లో ఇలాంటి సెటైర్స్ పడవు. సో.. ఈ నెల 20న రాజ్ తరుణ్ కెరీర్ డిసైడ్ అయ్యే రోజు అన్నమాట. 

More Related Stories