English   

కాలా.. కింగ్ ఆఫ్ ధారావి

kaala-release

కాలా.. కింగ్ ఆఫ్ ధారావి.. అంటూ కొత్త టైటిల్ యాడ్ చేశారు రజినీకాంత్ కాలాకు. కాకపోతే ఇది హిందీ వెర్షన్ టైటిల్. అయినా అదే నేపథ్యం అన్ని భాషల్లో ఉంటుంది. ముంబైలోని అతిపెద్ద మురికి వాడ పేరే ధారావి. ఆ నేపథ్యంలో నడిచే కథ కాబట్టి హిందీ ఆడియన్స్ కుబాగా కనెక్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే కాలా.. కింగ్ ఆఫ్ ధారావి అని పెట్టారు. ఇక తమిళ, తెలుగులో మాత్రం కాలాగానే వస్తున్నాడీ ‘కరికాలన్’. కబాలి తర్వాత మరోసారి ఆ దర్శకుడు పా. రంజిత్ డైరెక్షన్ లో రజినీకాంత్ చేసిన ఈ సినిమాలో కూడా వెట్టి మనుషుల వెతల్నే ప్రధానంగా హైలెట్ చేయబోతున్నారు.. ఆ విషయం ఈ మూవీ పాటలు వింటేనే తెలుస్తుంది. 

కబాలిపై భారీ అంచనాలుండటం, అందుకు తగ్గట్టుగా కాక, సినిమా అంతా ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడవడం వల్ల మైనస్ అయిపోయింది. అయితే ఈ సారి అందుకు భిన్నంగా ఉంటుందని టాక్. చూడ్డానికి ఫ్యామిలీ అంతా కనిపిస్తోన్నా మాఫియా బ్యాక్ డ్రాప్ లో రజినీ చేసే మ్యాజిక్ ఈ సారి ఫిదా చేస్తుందంటున్నారు. కబాలి లాగే కాలాలో కూడా భారీ తారాగణం కనిపిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ హీరోయిన్ గా నటించింది. అలాగే నిన్నటి నటి ఈశ్వరీ రావు రజినీకి ఓ పాత్రలో పెయిర్ గా నటించినట్టు తెలస్తోంది. ఇక మిగిలిన ఆర్టిస్టులంతా దాదాపు తమిళ్ వారే. ఏదేమైనా కాలాతో రజినీ ఖచ్చితంగా హిట్ కొట్టాలి.

ఇప్పటికే 2.0 ఎప్పుడు వస్తుందో తెలియకుండా పోయింది. ఆల్రెడీ గత రెండు మూడు సినిమాలూ డిజాస్టర్స్ అయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ ఎంట్రీకి ముందు వస్తోన్న ఈ మూవీ హిట్ అయితేనే రజినీకి కలిసొస్తుంది. లేదంటే ఆ తర్వాత చేస్తోన్న కార్తీక్ సుబ్బరాజ్ సినిమాకూ దెబ్బపడుతుంది. మరి జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న కాలాతో సూపర్ స్టార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.. 

More Related Stories