English   

ఈ నగరానికి ఏమైంది కి జక్కన్న రివ్యూ..!!

rajamouli-1
2018-06-29 15:33:33

గత కొంతకాలంగా మన సెలబ్రిటీస్ ఇతర వ్యవహారాల్లోనూ ట్వీట్ పెడుతున్నారు. అందులో భాగంగా ఏవైనా సినిమాలు నచ్చితే ఓపెన్ గా చెబుతున్నారు. గతంలో ఈ ట్రెండ్ ఉండేది కాదు. అయితే ఈ ట్రెండ్ లోనూ స్టాంప్ సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి. అంటే రాజమౌళి ఓ సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తే అది వైరల్ అవుతుంది. ఇది రాజమౌళికి నచ్చిన సినిమా అనే స్టాంప్ సంపాదించుకుంటుంది. అయితే తనకు నచ్చిన సినిమాలపై వెంటనే ట్వీట్స్ పెట్టే రాజమౌళి ఈ సారి తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాపై ట్వీట్ వేశాడు.

‘తరుణ్ భాస్కర్ మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా అంతా నవ్వులతో నిండి ఉంది. ఎంటైర్ టీమ్ కు నా అభినందనలు’ అంటూ రాజమౌళి చేసిన ట్వీట్ ఈ టీమ్ కు మరింత బలాన్నిచ్చిందనే చెప్పాలి. రీసెంట్ గా సమ్మోహనం సినిమాపైనా జక్కన్న ప్రశంసలు కురిపించాడు. సో.. రాజమౌళికి కూడా ఈ నగరానికి ఏమైంది సినిమా బాగా నచ్చిందన్నమాట.

ఇక పెళ్లి చూపులు తర్వాత మరోసారి అంతా కొత్తవారితో తరుణ్ భాస్కర్ రూపొందించిన ఈనగరానికి ఏమైంది సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ రూపొందించింది. కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉన్న ఈ మూవీ కంప్లీట్ రిజల్ట్ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More Related Stories