English   

రాజమౌళి.. ఛాలెంజ్ యాక్సెప్టెడ్

rajamouli
2018-07-24 17:40:57

ఈ మధ్య సెలబ్రిటీస్ మధ్య ఛాలెంజ్ లు బాగా పెరిగాయి. వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చిన ఈ ట్రెండ్ ఇండియాలోనూ బాగా పాపులర్ అయింది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది రకరకాల ఛాలెంజెస్ తో సోషల్ కాజ్ కోసం ఛాలెంజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఎమ్.పి కవిత కూడా ప్లాంట్ ఛాలెంజ్ లాంటిది రాజమౌళికి విసిరింది. అది అందుకున్న జక్కన్న ఆనందంగా తన పొలంలోనే ఓ మర్రి చెట్టును నాటాడు. అంతే కాదు.. తను కూడా ఈ ఛాలెంజ్ లో భాగంగా మరికొందరు సెలబ్రిటీస్ కు త్వరలోనే ఛాలెంజ్ విసరబోతున్నాడు. ఈ నేపథ్యంలో తను నాటిన మొక్కతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని కవితకు చెబుతూ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అన్నాడు.

బాహుబలితో దేశవ్యాప్తంగా టాప్ డైరెక్టర్ అన్న పేరు తెచ్చుకున్నాడు రాజమౌళి. ప్రపంచవ్యాప్తంగానూ ఓ దర్శకుడుగా తనకంటూ ఖచ్చితమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో రికార్డులు తిరగరాసిన ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న జక్కన్న త్వరలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ రూపొందించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోన్న హరిత హారంలో అనుకోకుండా భాగస్వామి అయ్యాడు రాజమౌళి. మరి తను ఎవరికి ఈ ప్లాంట్ చాలెంజ్ విసురుతాడో చూడాలి. 

More Related Stories